కంటినే నీ వోజలెల్లా కన్నుల యెదుట నేఁడు
(॥పల్లవి॥)
కంటినే నీ వోజలెల్లా కన్నుల యెదుట నేఁడు
ఇంటిలోనఁ గాచుకొని ఇందుకే వుందానవా
(॥కంటి॥)
పన్ని ఇద్దరము నొక్కపానుపుపై నుండగాఁను
సన్నలేమిసేసేవే సరసునికి
కిన్నెర వాయించేవంటా కెలన నిలుపుకొంటే
చన్నులమెఱుఁగు చూపి చవులుసేసేవా
(॥కంటి॥)
కగ్గులేక మాలో నేము కాఁగిలించుకోనఁగాను
సిగ్గులేక రేఁచేవే చెలువునికి
యెగ్గులేదు విడెము మాకిచ్చేవంటా నుండితే
దిగ్గన మాటాడి మోవితీపులు చల్లేవా
(॥కంటి॥)
మేలపురతులఁ గూడి మేము నవ్వుతా నుండఁగా
యేల మొక్కేవే శ్రీవేంకటేశ్వరునికి
ఆలవట్టము విసరేవంటాఁ బరాకై వుండితే
ఆలవై ఆతనికి నీ వాసకొలిపేవా
(||pallavi||)
kaṁṭine nī vojalĕllā kannula yĕduḍa nem̐ḍu
iṁṭilonam̐ gāsugŏni iṁduge vuṁdānavā
(||kaṁṭi||)
panni iddaramu nŏkkabānububai nuṁḍagām̐nu
sannalemiseseve sarasunigi
kinnĕra vāyiṁchevaṁṭā kĕlana nilubugŏṁṭe
sannulamĕṟum̐gu sūbi savulusesevā
(||kaṁṭi||)
kaggulega mālo nemu kām̐giliṁchugonam̐gānu
siggulega rem̐seve sĕluvunigi
yĕgguledu viḍĕmu māgichchevaṁṭā nuṁḍide
diggana māḍāḍi movidībulu sallevā
(||kaṁṭi||)
melaburadulam̐ gūḍi memu navvudā nuṁḍam̐gā
yela mŏkkeve śhrīveṁkaḍeśhvarunigi
ālavaṭṭamu visarevaṁṭām̐ barāgai vuṁḍide
ālavai ādanigi nī vāsagŏlibevā