కంటిమిఁగా నేఁడివెల్లా కన్నులారాను
(॥పల్లవి॥)
కంటిమిఁగా నేఁడివెల్లా కన్నులారాను
ఇంటనే నీ తపములు యీడేరెఁగా
(॥కంటి ॥)
చెలరేఁగి చెలరేఁగి చేసీ నీకు నూడిగాలు
చెలికి నెంతచన విచ్చితవో నీవు
కొలువులోపల నుండి కొప్పు నీకు దువ్వీని
వెలయ నదెటువంటి వేడుకో నీకు
(॥కంటి॥)
కొసరి కొసరి నీకుఁ గూరిమితో వీడెమిచ్చీ
పొసఁగ నెంతచవులువుట్టెనో నీకు
ముసిముసినవ్వుతో నీమొగమే తప్పకచూచీ
సుసరానఁ గళలెంత సోకెనో నీకు
(॥కంటి॥)
చెనకి చెనకి నిన్నుఁ జేరి చేరి కాఁగిలించీ
తని వెట్టు గలిగెనో తగిలి నీకు
యెనసితి శ్రీవేంకటేశ యలమేల్ మంగను
మన సొక్కటాయ నేమిమర్మమో నీకు
(||pallavi||)
kaṁṭimim̐gā nem̐ḍivĕllā kannulārānu
iṁṭane nī tabamulu yīḍerĕm̐gā
(||kaṁṭi ||)
sĕlarem̐gi sĕlarem̐gi sesī nīgu nūḍigālu
sĕligi nĕṁtasana vichchidavo nīvu
kŏluvulobala nuṁḍi kŏppu nīgu duvvīni
vĕlaya nadĕḍuvaṁṭi veḍugo nīgu
(||kaṁṭi||)
kŏsari kŏsari nīgum̐ gūrimido vīḍĕmichchī
pŏsam̐ga nĕṁtasavuluvuṭṭĕno nīgu
musimusinavvudo nīmŏgame tappagasūsī
susarānam̐ gaḽalĕṁta sogĕno nīgu
(||kaṁṭi||)
sĕnagi sĕnagi ninnum̐ jeri seri kām̐giliṁchī
tani vĕṭṭu galigĕno tagili nīgu
yĕnasidi śhrīveṁkaḍeśha yalamel maṁganu
mana sŏkkaḍāya nemimarmamo nīgu