Kamtimigaa yee vedugalu ne mellaanu

కంటిమిగా యీ వేడుకలు నే మెల్లాను
Language

(॥పల్లవి॥)
కంటిమిగా యీ వేడుకలు నే మెల్లాను
నంటున మీ కెటువంటి ననుపులో ఇపుడు

(॥కంటి॥)
యెనసి యాకె నీవు నిద్దరు నుండఁగఁ జూచి
మనసొక్కటాయ నేఁడు మాకెల్లాను
మునుపటివలెఁ గాదు మొగములఁ గళలుబ్బె
వనితు నీకు నెటువంటి సంతోషములో

(॥కంటి॥)
అలుకలుదేరి మేలమాడఁగా మిమ్మిటు చూచి
సెలవుల నవ్వు వచ్చెఁ జెలుల కెల్లా
చలముల మీవొట్లపడి వాసె సిగ్గుదేరె
తలపోఁత లెటువలెఁ దారుకాణ లాయవో

(॥కంటి॥)
వరుసతో రతి చేసి వచ్చి మీరాక చూచి
అరుదాయ సవతుల కందరికిని
నిరతి శ్ర వేంకటేశ నే నలమేలుమంగను
దొరసి కూడతిని మీదో టిపొందు లెట్టివో

(||pallavi||)
kaṁṭimigā yī veḍugalu ne mĕllānu
naṁṭuna mī kĕḍuvaṁṭi nanubulo ibuḍu

(||kaṁṭi||)
yĕnasi yāgĕ nīvu niddaru nuṁḍam̐gam̐ jūsi
manasŏkkaḍāya nem̐ḍu māgĕllānu
munubaḍivalĕm̐ gādu mŏgamulam̐ gaḽalubbĕ
vanidu nīgu nĕḍuvaṁṭi saṁtoṣhamulo

(||kaṁṭi||)
alugaluderi melamāḍam̐gā mimmiḍu sūsi
sĕlavula navvu vachchĕm̐ jĕlula kĕllā
salamula mīvŏṭlabaḍi vāsĕ sigguderĕ
talabom̐ta lĕḍuvalĕm̐ dārugāṇa lāyavo

(||kaṁṭi||)
varusado radi sesi vachchi mīrāga sūsi
arudāya savadula kaṁdarigini
niradi śhra veṁkaḍeśha ne nalamelumaṁganu
dŏrasi kūḍadini mīdo ṭibŏṁdu lĕṭṭivo