Kamtimi mee vedugalu kannuladudala nemu

కంటిమి మీ వేడుకలు కన్నులతుదల నేము
Language

(॥పల్లవి॥)
కంటిమి మీ వేడుకలు కన్నులతుదల నేము
వింటి మిన్నాళ్లు సుద్దులే వీనుల పండుగలు

(॥కంటి॥)
సిగ్గువడివుండఁగాను చెలిచేఇ వట్టి తీసి
యెగ్గులేక తొడమీఁద నిడుకొంటివి
అగ్గమై యంతటఁబోక ఆపెఇంటికే వచ్చి
కగ్గులే కాపెవాకిలిఁ గాచుకవున్నాఁడవు

(॥కంటి॥)
తలవంచుకుండఁగాను తక్కక నెమ్మొగమెత్తి
వెలయ మూపుపైఁ జేయి వేసితివి
చలువగా వప్పటిని చన్నులపై నీవొరిగి
మెలుపున నాపెతోనే మేలము లాడేవు

(॥కంటి॥)
గుట్టుతోడ నుండఁగాను కొంత కలమేల్ మంగను
నెట్టనఁ గాఁగిటఁ గూడి నించితి కృప
అట్టె శ్రీవేంకటేశ ఆపెకే నీవు మఱి
చుట్టమవై మమ్మునేలి చొక్కులఁబెట్టేవు

(||pallavi||)
kaṁṭimi mī veḍugalu kannuladudala nemu
viṁṭi minnāḽlu suddule vīnula paṁḍugalu

(||kaṁṭi||)
sigguvaḍivuṁḍam̐gānu sĕlisei vaṭṭi tīsi
yĕggulega tŏḍamīm̐da niḍugŏṁṭivi
aggamai yaṁtaḍam̐boga ābĕiṁṭige vachchi
kaggule kābĕvāgilim̐ gāsugavunnām̐ḍavu

(||kaṁṭi||)
talavaṁchuguṁḍam̐gānu takkaga nĕmmŏgamĕtti
vĕlaya mūbubaim̐ jeyi vesidivi
saluvagā vappaḍini sannulabai nīvŏrigi
mĕlubuna nābĕdone melamu lāḍevu

(||kaṁṭi||)
guṭṭudoḍa nuṁḍam̐gānu kŏṁta kalamel maṁganu
nĕṭṭanam̐ gām̐giḍam̐ gūḍi niṁchidi kṛpa
aṭṭĕ śhrīveṁkaḍeśha ābĕge nīvu maṟi
suṭṭamavai mammuneli sŏkkulam̐bĕṭṭevu