కంటిమి మీ సరితలు కందువగాను
(॥పల్లవి॥)
కంటిమి మీ సరితలు కందువగాను
ఇంటికి రావయ్యా యీడనేల చెనకేవు
(॥కంటి॥)
మగువయు నీవును మాటలాడుకొనఁగాను
చిగురాకు మోవులపై చిల్లులాయను
నగవులు లోలోనె నవ్వఁగాను దట్టములై
బిగువుఁ జెక్కుల మీఁదఁ బేంట్లాయను
(॥కంటి॥)
తనియక వొండొరులు తమకానఁ బెనఁగఁగా
తనువున చెమటలు ధారలాయను
గొనకొని మీఁద మీఁదఁ గొచ్చి కొచ్చి చూడఁగాను
పొనుఁగక మెడలకు పూదండలాయను
(॥కంటి॥)
చెలఁగి మీరిద్దరుఁ బై చేతులు చాఁచుకొనఁగా
పులకలు నిలువులఁ బోగులాయను
యెలమి శ్రీ వేంకటేశ ఇంతలో నన్నేలితివి
తలకొన్న వలపులు తారుమారులాయను
(||pallavi||)
kaṁṭimi mī saridalu kaṁduvagānu
iṁṭigi rāvayyā yīḍanela sĕnagevu
(||kaṁṭi||)
maguvayu nīvunu māḍalāḍugŏnam̐gānu
sigurāgu movulabai sillulāyanu
nagavulu lolonĕ navvam̐gānu daṭṭamulai
biguvum̐ jĕkkula mīm̐dam̐ beṁṭlāyanu
(||kaṁṭi||)
taniyaga vŏṁḍŏrulu tamagānam̐ bĕnam̐gam̐gā
tanuvuna sĕmaḍalu dhāralāyanu
gŏnagŏni mīm̐da mīm̐dam̐ gŏchchi kŏchchi sūḍam̐gānu
pŏnum̐gaga mĕḍalagu pūdaṁḍalāyanu
(||kaṁṭi||)
sĕlam̐gi mīriddarum̐ bai sedulu sām̐sugŏnam̐gā
pulagalu niluvulam̐ bogulāyanu
yĕlami śhrī veṁkaḍeśha iṁtalo nannelidivi
talagŏnna valabulu tārumārulāyanu