కంటిఁగా తమ పొందులు కన్నులారాను
(॥పల్లవి॥)
కంటిఁగా తమ పొందులు కన్నులారాను
ఇంటిలో నా చుట్టరిక మెందువోయీనే
(॥కంటి॥)
యే పొద్దూ బాయనివారి నెగసక్కేలాడనేల
కాఁపైపురాలు సే సేవారిఁ గలఁచనేల
రాఁపై వలచినవారి రవ్వలఁ బెట్టఁగనేల
ఆఁపరాని తమకము లడ్డపెట్టవసమా
(॥కంటి॥)
ఆసపడివున్నవారి యనువు దప్పించనేల
బాససేసుకొన్నవారిఁ బాపఁగనేల
వేసారక వుండేవారి వెలికిఁ బిలువనేల
మూసిమంతనపు గుట్టు ముంగిటికి దే వచ్చునా
(॥కంటి॥)
యెనసి వుండినవారి నెఱుకసేసుకోనేల
పెనఁగులాడేవారి బెల్లించనేల
నను శ్రీ వేంకటేశుఁడు నయముననే కూడె
పనులెల్లాఁ జక్కనాయ పదరఁగనేఁటికి
(||pallavi||)
kaṁṭim̐gā tama pŏṁdulu kannulārānu
iṁṭilo nā suṭṭariga mĕṁduvoyīne
(||kaṁṭi||)
ye pŏddū bāyanivāri nĕgasakkelāḍanela
kām̐paiburālu se sevārim̐ galam̐sanela
rām̐pai valasinavāri ravvalam̐ bĕṭṭam̐ganela
ām̐parāni tamagamu laḍḍabĕṭṭavasamā
(||kaṁṭi||)
āsabaḍivunnavāri yanuvu dappiṁchanela
bāsasesugŏnnavārim̐ bābam̐ganela
vesāraga vuṁḍevāri vĕligim̐ biluvanela
mūsimaṁtanabu guṭṭu muṁgiḍigi de vachchunā
(||kaṁṭi||)
yĕnasi vuṁḍinavāri nĕṟugasesugonela
pĕnam̐gulāḍevāri bĕlliṁchanela
nanu śhrī veṁkaḍeśhum̐ḍu nayamunane kūḍĕ
panulĕllām̐ jakkanāya padaram̐ganem̐ṭigi