కంటిమే నీయందు నేఁడు కన్నుల పండుగగాను
(॥పల్లవి॥)
కంటిమే నీయందు నేఁడు కన్నుల పండుగగాను
పెంటలైన సంతోసాలు పెనగొనీ నీకును
(॥కంటి॥)
కలికితనాల మంచికనుఁగొనచూపులు
సెలవినవ్వులలోని చిరిసిగ్గులు
బలుచన్నులమీఁది పయ్యెదజారులును
వలపుఁదేనెమోవి వసివాడులు
(॥కంటి॥)
సమ్మతించ నాడేటి సణఁగులమాటలు
చెమ్మఁ జెమటలలోని చే సన్నలు
వుమ్మగిలేవూరుపుల వుబ్బరిమోము కళలు
తమ్మల వుక్కిళ్ళ తరితీపులు
(॥కంటి॥)
గుట్టుతోనే వెదచల్లే కొసరుల సళుపులు
తట్టమైన యాసల తమకములు
యిట్టె శ్రీవేంకటేశుఁ డిటు నిన్నుఁ గూడఁగాను
నెట్టుకొన రతులలో నేరుపుల సిరుల
(||pallavi||)
kaṁṭime nīyaṁdu nem̐ḍu kannula paṁḍugagānu
pĕṁṭalaina saṁtosālu pĕnagŏnī nīgunu
(||kaṁṭi||)
kaligidanāla maṁchiganum̐gŏnasūbulu
sĕlavinavvulaloni sirisiggulu
balusannulamīm̐di payyĕdajārulunu
valabum̐denĕmovi vasivāḍulu
(||kaṁṭi||)
sammadiṁcha nāḍeḍi saṇam̐gulamāḍalu
sĕmmam̐ jĕmaḍalaloni se sannalu
vummagilevūrubula vubbarimomu kaḽalu
tammala vukkiḽḽa taridībulu
(||kaṁṭi||)
guṭṭudone vĕdasalle kŏsarula saḽubulu
taṭṭamaina yāsala tamagamulu
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍiḍu ninnum̐ gūḍam̐gānu
nĕṭṭugŏna radulalo nerubula sirula