కంటిఁ గంటి మిదె కలిగె మా పాలిట
(॥పల్లవి॥)
కంటిఁ గంటి మిదె కలిగె మా పాలిట
యింటి వేలుపై యేలీ వీఁడె
(॥కంటి॥)
శ్రీ నరసింహుఁడు చిన్నయ రూపుఁడు
నానామహిమల నాటరుఁ(కుఁ?) డు
దానవాంతకుఁడు దైవశిఖామణి
పూని యహోబలపురపతి వీఁడే
(॥కంటి॥)
పరమ పూరుషుఁడు ప్రహ్లాదవరుదుఁడు
హరి లోకోన్నతుఁ డనంతుఁడు
దురిత విదారుఁడు దుష్టభంజకుఁడు
సిరుల నహోబలశ్రీపతి వీఁడే
(॥కంటి॥)
చెలువుఁడు వరదుఁడు జీవాంతరాత్ముఁడు
నిలిచె శ్రీవేంకట నిధియందు
బలువుఁడు సులభుఁడు భక్తరక్షకుఁడు
లలి నహోబలవిలాసుఁడు వీఁడే
(||pallavi||)
kaṁṭim̐ gaṁṭi midĕ kaligĕ mā pāliḍa
yiṁṭi velubai yelī vīm̐ḍĕ
(||kaṁṭi||)
śhrī narasiṁhum̐ḍu sinnaya rūbum̐ḍu
nānāmahimala nāḍarum̐(kum̐?) ḍu
dānavāṁtagum̐ḍu daivaśhikhāmaṇi
pūni yahobalaburabadi vīm̐ḍe
(||kaṁṭi||)
parama pūruṣhum̐ḍu prahlādavarudum̐ḍu
hari logonnadum̐ ḍanaṁtum̐ḍu
durida vidārum̐ḍu duṣhṭabhaṁjagum̐ḍu
sirula nahobalaśhrībadi vīm̐ḍe
(||kaṁṭi||)
sĕluvum̐ḍu varadum̐ḍu jīvāṁtarātmum̐ḍu
nilisĕ śhrīveṁkaḍa nidhiyaṁdu
baluvum̐ḍu sulabhum̐ḍu bhaktarakṣhagum̐ḍu
lali nahobalavilāsum̐ḍu vīm̐ḍe