Kamtileve seliyaa kadagaari nee semtalu

కంటిలేవే చెలియా కతకారి నీ చేఁతలు
Language

(॥పల్లవి॥)
కంటిలేవే చెలియా కతకారి నీ చేఁతలు
దంటతనమున నింకా తారుకాణించనేలే

(॥కంటి॥)
కళలు మోమునఁ దేరె కన్నులఁ గెంజాయ మించె
తలకూడెఁ బను లింకఁ దాఁచనేఁటికే
పిలువఁ బోతివి నీవు ప్రియుఁడు నిన్నింతసేసె
వలపు పట్టరానిది వట్టిమాఁట లేఁటికే

(॥కంటి॥)
వాసనలు మేన నిండె వడియఁ జొచ్చెఁ జెమట
సేసిన చేఁతలు చెల్లె సిగ్గు లేఁటికే
నా సుద్దులు చెప్పితివి నడుముఁదాఁ బెండ్లాడె
ఆసలు కొండలవంటి వాతఁ డేమిసేసునే

(॥కంటి॥)
చిన్నలు చెక్కుల నిండె సెలవి నవ్వులు రేఁగె
పన్నుగడ లొక్కటాయ బయమేఁటికే
యిన్నిటా శ్రీవేంకటేశుఁ డీడకు వచ్చి నన్నేలె
చిన్నపాయ మింత సేసె చెప్పవలెనటవే

(||pallavi||)
kaṁṭileve sĕliyā kadagāri nī sem̐talu
daṁṭadanamuna niṁkā tārugāṇiṁchanele

(||kaṁṭi||)
kaḽalu momunam̐ derĕ kannulam̐ gĕṁjāya miṁchĕ
talagūḍĕm̐ banu liṁkam̐ dām̐sanem̐ṭige
piluvam̐ bodivi nīvu priyum̐ḍu ninniṁtasesĕ
valabu paṭṭarānidi vaṭṭimām̐ṭa lem̐ṭige

(||kaṁṭi||)
vāsanalu mena niṁḍĕ vaḍiyam̐ jŏchchĕm̐ jĕmaḍa
sesina sem̐talu sĕllĕ siggu lem̐ṭige
nā suddulu sĕppidivi naḍumum̐dām̐ bĕṁḍlāḍĕ
āsalu kŏṁḍalavaṁṭi vādam̐ ḍemisesune

(||kaṁṭi||)
sinnalu sĕkkula niṁḍĕ sĕlavi navvulu rem̐gĕ
pannugaḍa lŏkkaḍāya bayamem̐ṭige
yinniḍā śhrīveṁkaḍeśhum̐ ḍīḍagu vachchi nannelĕ
sinnabāya miṁta sesĕ sĕppavalĕnaḍave