కంకణము గట్టవయ్యా కలికికిని
(॥పల్లవి॥)
కంకణము గట్టవయ్యా కలికికిని
అంకెల నీకుఁ దలఁపయ్యేటట్టుగాను
(॥కంక॥)
యెప్పుడు నీమనసులో నింతిని మఱవకుండా
కుప్పెలువంటిచన్నులు గుఱుతుచూచుకోవయ్యా
నెప్పునఁ బెక్కుసతులనే స్తముగలవాఁడవు
తప్పక వారిలో నీకె తడఁబడకుండాను
(॥కంక॥)
ఇందుముఖి యందరిలో నెరకైవుండేయట్టుగా
ముందే చక్కఁదన మురమున వాసుకొనవయ్య
పొందు లెందైనాఁ జేసి భోగించేవాఁడవు
సందడి ననుమానము సారె రాకుండాను
(॥కంక॥)
ఇదె యలమేలు మంగ నేలితివి ననుపుగా
పదిమారు లీకెపేరు పాటముసేసుకోవయ్య
పదరి శ్రీవేంకటేశ పదారువేలనేలితి-
వెదుగా నందు వెదకి యెంచుకోకుండాను
(||pallavi||)
kaṁkaṇamu gaṭṭavayyā kaligikini
aṁkĕla nīgum̐ dalam̐payyeḍaṭṭugānu
(||kaṁka||)
yĕppuḍu nīmanasulo niṁtini maṟavaguṁḍā
kuppĕluvaṁṭisannulu guṟudusūsugovayyā
nĕppunam̐ bĕkkusadulane stamugalavām̐ḍavu
tappaga vārilo nīgĕ taḍam̐baḍaguṁḍānu
(||kaṁka||)
iṁdumukhi yaṁdarilo nĕragaivuṁḍeyaṭṭugā
muṁde sakkam̐dana muramuna vāsugŏnavayya
pŏṁdu lĕṁdainām̐ jesi bhogiṁchevām̐ḍavu
saṁdaḍi nanumānamu sārĕ rāguṁḍānu
(||kaṁka||)
idĕ yalamelu maṁga nelidivi nanubugā
padimāru līgĕberu pāḍamusesugovayya
padari śhrīveṁkaḍeśha padāruvelanelidi-
vĕdugā naṁdu vĕdagi yĕṁchugoguṁḍānu