కంకణ సూడిగెముల కామినివి యీ
(॥పల్లవి॥)
కంకణ సూడిగెముల కామినివి యీ-
యంకెల నీభావమెల్లా నానతియ్యవే
(॥కంక॥)
వెలఁది మొక్కేవు నీవు వేమారు మరునికే
మెలుపై నీకీలుగంటు మిట్టిపడఁగా
పులుకుఁగుచములతోనూఁగేటిసరులతో
నలపే విదేమిగోరే వానతియ్యవే
(॥కంక॥)
గరిమ నోమేవు నవు కంతునిఁ బూజలు సేసి
శిరసుచెమట మేనఁ జిందఁగాను
వరుస నూరుపులతో వలగొని బడలేవు
అరిది నీతలఁపెల్లా నానతియ్యవే
(॥కంక॥)
మంతనాన నొడిగేవు మదనమంత్రములే
దొంతిపులకలు మేనఁదొడరఁగాను
యింతి నీవు శ్రీవేంకటేశు నీకాఁగిటఁ గూడి
అంతలో నవ్వినదేమి ఆనతియ్యవే
(||pallavi||)
kaṁkaṇa sūḍigĕmula kāminivi yī-
yaṁkĕla nībhāvamĕllā nānadiyyave
(||kaṁka||)
vĕlam̐di mŏkkevu nīvu vemāru marunige
mĕlubai nīgīlugaṁṭu miṭṭibaḍam̐gā
pulugum̐gusamuladonūm̐geḍisarulado
nalabe videmigore vānadiyyave
(||kaṁka||)
garima nomevu navu kaṁtunim̐ būjalu sesi
śhirasusĕmaḍa menam̐ jiṁdam̐gānu
varusa nūrubulado valagŏni baḍalevu
aridi nīdalam̐pĕllā nānadiyyave
(||kaṁka||)
maṁtanāna nŏḍigevu madanamaṁtramule
dŏṁtibulagalu menam̐dŏḍaram̐gānu
yiṁti nīvu śhrīveṁkaḍeśhu nīgām̐giḍam̐ gūḍi
aṁtalo navvinademi ānadiyyave