కందువ నప్పటినుండి కాచుకున్నాఁ డాతఁడే
(॥పల్లవి॥)
కందువ నప్పటినుండి కాచుకున్నాఁ డాతఁడే
చెంది వూడిగములెల్లా చిత్తము రాఁ జేయవే
(॥కందు॥)
పవళించినాఁడు పతి పాదాలు పిసుకవే
ఇవల వాకిటనుండి యేమిసేసేవు
తివిరి పన్నీరడిగీఁ దెచ్చేనని పలుకవే
చివురుమోవినవ్వుల సిగ్గువడనేఁటికే
(॥కందు॥)
కదిసి నిద్దురవోఁడు కతచెప్పఁగదవే
యెదుట నిలువుటద్ద మేమిచూచేవు
అదివో విసరుమనీ నండనే కూంచుండవే
కొదికి వట్టిగుట్టున గుబ్బతిలనేఁటికే
(॥కందు॥)
యేకతానఁ బోద్దువొదు యెనసి మాటాడవే
యీకడఁ జెలితో జూజాలేమాడేవు
పైకొని యలమేల్‌మంగపతి శ్రీవేంకటేశుఁడు
నీకాఁగిట నిదె కూడె నివ్వర గేమిటికే
(||pallavi||)
kaṁduva nappaḍinuṁḍi kāsugunnām̐ ḍādam̐ḍe
sĕṁdi vūḍigamulĕllā sittamu rām̐ jeyave
(||kaṁdu||)
pavaḽiṁchinām̐ḍu padi pādālu pisugave
ivala vāgiḍanuṁḍi yemisesevu
tiviri pannīraḍigīm̐ dĕchchenani palugave
sivurumovinavvula sigguvaḍanem̐ṭige
(||kaṁdu||)
kadisi nidduravom̐ḍu kadasĕppam̐gadave
yĕduḍa niluvuḍadda memisūsevu
adivo visarumanī naṁḍane kūṁchuṁḍave
kŏdigi vaṭṭiguṭṭuna gubbadilanem̐ṭige
(||kaṁdu||)
yegadānam̐ bodduvŏdu yĕnasi māḍāḍave
yīgaḍam̐ jĕlido jūjālemāḍevu
paigŏni yalamelmaṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍu
nīgām̐giḍa nidĕ kūḍĕ nivvara gemiḍige