కందువ కాఁగిటఁ గూడి కరఁగుచుందువుగాక
(॥పల్లవి॥)
కందువ కాఁగిటఁ గూడి కరఁగుచుందువుగాక
నిందలేని నీ బోటికి నివ్వెరగు చెల్లునా
(॥కందు॥)
చనవరికత్తెలము జగడాలడుతుమా
చెనకి నీకే ప్రియాలు చెప్పేము కాక
పెనఁగుచు నీకునీవే బింకములు నెరపేవు
వనితలతోడ మగవానికింత గలదా
(॥కందు॥)
పట్టపుదేవులమింత పంతాలాడుదుమా
వొట్టుక నీవద్దఁ గాచుకుందుముగాక
వట్టినవ్వులు నవ్వేవు వాసులకుఁదిగిగేవు
దిట్టమగువలతోడ దీమసము వలెనా
(॥కందు॥)
వూడిగాలు సేసేవార మొరటులు పట్టుదుమా
వేడుకఁ గూడి బారము వేతుముగాక
యీడనే శ్రీ వేంకటేశ ఇటు నన్నుఁగలసితి
జాడతోడి మాతోడ చలము సాదింతురా
(||pallavi||)
kaṁduva kām̐giḍam̐ gūḍi karam̐gusuṁduvugāga
niṁdaleni nī boḍigi nivvĕragu sĕllunā
(||kaṁdu||)
sanavarigattĕlamu jagaḍālaḍudumā
sĕnagi nīge priyālu sĕppemu kāga
pĕnam̐gusu nīgunīve biṁkamulu nĕrabevu
vanidaladoḍa magavānigiṁta galadā
(||kaṁdu||)
paṭṭabudevulamiṁta paṁtālāḍudumā
vŏṭṭuga nīvaddam̐ gāsuguṁdumugāga
vaṭṭinavvulu navvevu vāsulagum̐digigevu
diṭṭamaguvaladoḍa dīmasamu valĕnā
(||kaṁdu||)
vūḍigālu sesevāra mŏraḍulu paṭṭudumā
veḍugam̐ gūḍi bāramu vedumugāga
yīḍane śhrī veṁkaḍeśha iḍu nannum̐galasidi
jāḍadoḍi mādoḍa salamu sādiṁturā