Kallu kallaado kalale sebide

కళ్ళు కళ్ళాతో కలలే చెబితే
Year
Language

పల్లవి:

కళ్లు కళ్లతో కలలే చెబితే ..మనసు మసుపై అలలా పడితే
కొత్తకొత్తగా చిగురించేదే ప్రేమ .. చూపు చూపుతో చిరు ఢీ కొడితే
నవ్వు నవ్వుతో స్నేహం కడితే .. నిన్నలేనిది నేడు చేరితే ప్రేమ
అందంగా అందంగా పెనవేస్తూ బంధంగా .. చేస్తుంది చిత్రంగా బ్రతుకంతా మధురంగా
మది వేగం పెరిగితే ప్రేమా ..హృది రాగం పలికితే ప్రేమ
ఎదలేకం అఅయితే మౌనం తొలిప్రేమ ..దిల్ మే ప్యార్ హై మన్ మే ఇష్క్ హై

చరణం 1:

ఉండదుగా నిదురుండదుగా మరి ఊహల వలలా
ఇక అల్లరులే శృతి మించెనుగా ప్రతిరేయిలో కలలా
ఇది అర్థం కాని మాయా ఏదో తియ్యుని బాధ
చెప్పకనే చేరి అది చంపేస్తుంది మైకాన
స్పప్నాలై చల్లి ఇది మున్చేస్తుంది స్వర్గాన

ఊహకు కల్పన ప్రేమా .. మది ఊసుల వంతెన ప్రేమ
ఈ గుప్పెడు గుండెలో ఉప్పెన ఈ ప్రేమ ... !
దిల్ మే ప్యార్ హై మన్ మే ఇష్క్ హై

చరణం 2:

తొందరగా వివరించాలి నీ తియ్యుని దిగులు
మరి ఒప్పుకుని అందించాలి తన నవ్వుతో బదులు
సరికొత్తగా ఉంది అంతా .. అరె ఎన్నడు లేని వింత
తానుంటే చాలు వాసంతం నాకే వస్తుంది
ఆనందం అంతా దాసోహం నాకే అవుతుంది
ఇది గుసగుసలాడే ప్రేమ ..నను త్వరపెడుతుంది ప్రేమ
తొలిసారిగా అందితే హాయే ఈ ప్రేమా ...!
దిల్ మే ప్యార్ హై వున్ మే ఇష్క్ హై

pallavi:

kaḽlu kaḽlado kalale sĕbide ..manasu masubai alalā paḍide
kŏttagŏttagā siguriṁchede prema .. sūbu sūbudo siru ḍhī kŏḍide
navvu navvudo snehaṁ kaḍide .. ninnalenidi neḍu seride prema
aṁdaṁgā aṁdaṁgā pĕnavestū baṁdhaṁgā .. sestuṁdi sitraṁgā bradugaṁtā madhuraṁgā
madi vegaṁ pĕrigide premā ..hṛdi rāgaṁ paligide prema
ĕdalegaṁ aayide maunaṁ tŏliprema ..dil me pyār hai man me iṣhk hai

saraṇaṁ 1:

uṁḍadugā niduruṁḍadugā mari ūhala valalā
iga allarule śhṛti miṁchĕnugā pradireyilo kalalā
idi ardhaṁ kāni māyā edo tiyyuni bādha
sĕppagane seri adi saṁpestuṁdi maigāna
spapnālai salli idi munchestuṁdi svargāna

ūhagu kalbana premā .. madi ūsula vaṁtĕna prema
ī guppĕḍu guṁḍĕlo uppĕna ī prema ... !
dil me pyār hai man me iṣhk hai

saraṇaṁ 2:

tŏṁdaragā vivariṁchāli nī tiyyuni digulu
mari ŏppuguni aṁdiṁchāli tana navvudo badulu
sarigŏttagā uṁdi aṁtā .. arĕ ĕnnaḍu leni viṁta
tānuṁṭe sālu vāsaṁtaṁ nāge vastuṁdi
ānaṁdaṁ aṁtā dāsohaṁ nāge avuduṁdi
idi gusagusalāḍe prema ..nanu tvarabĕḍuduṁdi prema
tŏlisārigā aṁdide hāye ī premā ...!
dil me pyār hai vun me iṣhk hai