కల్ల సుమ్మీ రమణుఁడ కలఁగీ నిందుకే మతి
(॥పల్లవి॥)
కల్ల సుమ్మీ రమణుఁడ కలఁగీ నిందుకే మతి
తొల్లిటి నీగుణ మెట్టు తోఁచెనోకాని
(॥కల్ల॥)
ఆడఁజుమ్మీ నిన్ను నేను అంతచులుకనిమాట
వాడికె నీకెట్టు నిందవచ్చెనోకాని
తోడ వేగువెట్టుసుమ్మీ దొరవు నీమీఁద నేను
యేడ నిన్నెవ్వతె సందేహించెనోకాని
(॥కల్ల॥)
నవ్వఁజుమ్మీ నే నిన్ను నాతులయీసభలోన
అవ్వల నీమీఁద నెట్టు అంటెనోకాని
యెవ్వరితోఁ జెప్పఁ జుమ్మీ యిట్టునట్టు అని నిన్ను
దవ్వుల నీకాఁక యెటు తగిలెనోకాని
(॥కల్ల॥)
చూడఁజుమ్మి నిన్ను నేను చురుకన గుండెనాఁట
ఆడనే నీ వెట్టు గుఱియైతివో కాని
వేడుక శ్రీవేంకటేశ వెలయ నన్నుఁగూడితి-
వాడుకో లిదేసుమ్మీ ఆనతిత్తుఁగాని
(||pallavi||)
kalla summī ramaṇum̐ḍa kalam̐gī niṁduge madi
tŏlliḍi nīguṇa mĕṭṭu tom̐sĕnogāni
(||kalla||)
āḍam̐jummī ninnu nenu aṁtasuluganimāḍa
vāḍigĕ nīgĕṭṭu niṁdavachchĕnogāni
toḍa veguvĕṭṭusummī dŏravu nīmīm̐da nenu
yeḍa ninnĕvvadĕ saṁdehiṁchĕnogāni
(||kalla||)
navvam̐jummī ne ninnu nādulayīsabhalona
avvala nīmīm̐da nĕṭṭu aṁṭĕnogāni
yĕvvaridom̐ jĕppam̐ jummī yiṭṭunaṭṭu ani ninnu
davvula nīgām̐ka yĕḍu tagilĕnogāni
(||kalla||)
sūḍam̐jummi ninnu nenu surugana guṁḍĕnām̐ṭa
āḍane nī vĕṭṭu guṟiyaidivo kāni
veḍuga śhrīveṁkaḍeśha vĕlaya nannum̐gūḍidi-
vāḍugo lidesummī ānadittum̐gāni