పల్లవి:
కలిసే ప్రతి సంధ్యలో ...కలిగే పులకింతలో
కలిసే ప్రతి సంధ్యలో కలిగే పులకింతలో
నాట్యాలన్నీ కరగాలి.. నీలో నేనే మిగలాలి
నాట్యాలన్నీ కరగాలి నీలో నేనే మిగలాలి
కలిసే ప్రతి సంధ్యలో...పలికే ప్రతి అందెలో
చరణం 1:
పొంగిపోదా సాగరాత్మ నింగికి
చేరుకోదా చంద్ర హృదయం నీటికి
సృష్టిలోన ఉంది ఈ బంధమే
అల్లుకుంది అంతటా అందమే
తొణికే బిడియం తొలగాలి
ఒణికే అధరం పిలవాలి
ఆ..ఆ...ఆ...
కలిసే ప్రతి సంధ్యలో...పలికే ప్రతి అందెలో
చరణం 2:
మేనితోనే ఆగుతాయి ముద్రలు
గుండె దాకా సాగుతాయి ముద్దులు
ఇంత తీపి కొంతగా పంచుకో
వెన్నెలంత కళ్ళలో నింపుకో
బ్రతుకే జతగా పారాలి...పరువం తీరం చేరాలి
ఆ...ఆ...ఆ...ఆ
కలిసే ప్రతి సంధ్యలో...పలికే ప్రతి అందెలో ||2||
నాట్యాలెన్నో ఎదగాలి నాలో నేనై మిగలాలి ||2||
కలిసే ప్రతి సంధ్యలో...కలిగే పులకింతలో
pallavi:
kalise pradi saṁdhyalo ...kalige pulagiṁtalo
kalise pradi saṁdhyalo kalige pulagiṁtalo
nāṭyālannī karagāli.. nīlo nene migalāli
nāṭyālannī karagāli nīlo nene migalāli
kalise pradi saṁdhyalo...palige pradi aṁdĕlo
saraṇaṁ 1:
pŏṁgibodā sāgarātma niṁgigi
serugodā saṁdra hṛdayaṁ nīḍigi
sṛṣhṭilona uṁdi ī baṁdhame
alluguṁdi aṁtaḍā aṁdame
tŏṇige biḍiyaṁ tŏlagāli
ŏṇige adharaṁ pilavāli
ā..ā...ā...
kalise pradi saṁdhyalo...palige pradi aṁdĕlo
saraṇaṁ 2:
menidone āgudāyi mudralu
guṁḍĕ dāgā sāgudāyi muddulu
iṁta tībi kŏṁtagā paṁchugo
vĕnnĕlaṁta kaḽḽalo niṁpugo
braduge jadagā pārāli...paruvaṁ tīraṁ serāli
ā...ā...ā...ā
kalise pradi saṁdhyalo...palige pradi aṁdĕlo ||2||
nāṭyālĕnno ĕdagāli nālo nenai migalāli ||2||
kalise pradi saṁdhyalo...kalige pulagiṁtalo