Kaligivi neeveramgani tagavu lunnavaa

కలికివి నీవెరఁగని తగవు లున్నవా
Language

(॥పల్లవి॥)
కలికివి నీవెరఁగని తగవు లున్నవా
చెలులము నే మింత చెప్పిచూపవలెనా

(॥కలి ॥)
వాడికగా రమణుఁడు వలపులు చల్లితేను
యీడనే సిగ్గున శిరసేల వంచేవే
వేడుకతో చందురుఁడు వెన్నెలలు గాసితేను
జోడుగాఁ గలువలు మెచ్చుగ వికసించవా

(॥కలి॥)
మంతనాన నాతఁడు మాటలు నిన్నాడించితే
పంతముతో మోనములు పచరింతురా
వంతలేక వనముల వసంతుఁడు పైకొంటే
బంతినే కోవిలలునుఁ బలుకఁగవలదా

(॥చెలి॥)
సారె శ్రీవేంకటేశుఁ డిచ్చటఁ గాఁగిలించితేను
కూరిమి నలమేల్ మంగ కూడితి వౌనే
మేరతోడఁ గొండమీఁద మేఘము వాలితేను
చేరిచేరి మయూరాలు చెంగలించి ఆడుఁగా

(||pallavi||)
kaligivi nīvĕram̐gani tagavu lunnavā
sĕlulamu ne miṁta sĕppisūbavalĕnā

(||kali ||)
vāḍigagā ramaṇum̐ḍu valabulu sallidenu
yīḍane sigguna śhirasela vaṁcheve
veḍugado saṁdurum̐ḍu vĕnnĕlalu gāsidenu
joḍugām̐ galuvalu mĕchchuga vigasiṁchavā

(||kali||)
maṁtanāna nādam̐ḍu māḍalu ninnāḍiṁchide
paṁtamudo monamulu pasariṁturā
vaṁtalega vanamula vasaṁtum̐ḍu paigŏṁṭe
baṁtine kovilalunum̐ balugam̐gavaladā

(||sĕli||)
sārĕ śhrīveṁkaḍeśhum̐ ḍichchaḍam̐ gām̐giliṁchidenu
kūrimi nalamel maṁga kūḍidi vaune
meradoḍam̐ gŏṁḍamīm̐da meghamu vālidenu
seriseri mayūrālu sĕṁgaliṁchi āḍum̐gā