Kaligemgaa neegu naabe kaamanidhaanamuvale

కలిగెఁగా నీకు నాపె కామనిధానమువలె
Language

(॥పల్లవి॥)
కలిగెఁగా నీకు నాపె కామనిధానమువలె
యెలమి నీభాగ్య మింక నేమి చెప్పేదయ్యా

(॥॥)
వొద్దిక నెట్టనెదుర నుంచుకొని కొలువులో-
నద్దమువలెఁ జూచేవు ఆపెమొగము
గద్దించి తానిచ్చినబాగాలు పుక్కిటఁ బెట్టుక
చద్దివలె దాఁచుకొని చవులుగొనేవు

(॥॥)
ఆతిముదమున నాపె నడుగుకొంటాఁ బురాణ-
కతలువలె వినేవు కాంతమాటలు
తతి నాపెచూపలు పూదండలువలెనే నీమై
సతము భావించుక సంతోసించుకొనేవు

(॥॥)
నీకుఁ గానుక వచ్చిన నిమ్మపండ్లవలెనే
పైకొని సారెనంటే వాభామచన్నులు
యీకడ శ్రీ వేంకటేశ యిట్టె నన్నురతిఁ గూడి
సాకిరిగాఁ బెట్టుకొని జంటపెండ్లాడేవు

(||pallavi||)
kaligĕm̐gā nīgu nābĕ kāmanidhānamuvalĕ
yĕlami nībhāgya miṁka nemi sĕppedayyā

(||||)
vŏddiga nĕṭṭanĕdura nuṁchugŏni kŏluvulo-
naddamuvalĕm̐ jūsevu ābĕmŏgamu
gaddiṁchi tānichchinabāgālu pukkiḍam̐ bĕṭṭuga
saddivalĕ dām̐sugŏni savulugŏnevu

(||||)
ādimudamuna nābĕ naḍugugŏṁṭām̐ burāṇa-
kadaluvalĕ vinevu kāṁtamāḍalu
tadi nābĕsūbalu pūdaṁḍaluvalĕne nīmai
sadamu bhāviṁchuga saṁtosiṁchugŏnevu

(||||)
nīgum̐ gānuga vachchina nimmabaṁḍlavalĕne
paigŏni sārĕnaṁṭe vābhāmasannulu
yīgaḍa śhrī veṁkaḍeśha yiṭṭĕ nannuradim̐ gūḍi
sāgirigām̐ bĕṭṭugŏni jaṁṭabĕṁḍlāḍevu