కలశాపురముకాడ కందువతోటల నీడ
(॥పల్లవి॥)
కలశాపురముకాడ కందువతోటల నీడ
వెలయుచు నున్నవాఁడు వీఁడె హనుమంతుఁడు
(॥కల॥)
తాటింటి పండ్లగొల దాపరి చేతఁ బట్టక
వాటమై దైత్యులఁ గొట్ట వలచె యెత్తి
గాఁటాన శిరసుపైకి గక్కనఁ దోఁక నిక్కించి
యేటియై నిలుచున్నాఁడు మించి హనుమంతుఁడు
(॥కల॥)
బాలసూర్యబింబమును పండుగాను భావించి
చాలుకొనఁ బాదముల జంగ చాఁచి
కోలుముందుగా సత్వ గూడ నుర ముబ్బించి
నేలా మిన్నూ మోచినాఁడు నిండి హనుమంతుఁడు
(॥కల॥)
ముంచిన ప్రతాపమున మొగము బిగించుకొని
అంచెల నన్నిటాను జయమునఁ బొంది
యెంచఁగ శ్రీవేంకటేశు కితవరి దాసుఁడై
మంచి వరము లిచ్చీని మాకు హనుమంతుఁడు
(||pallavi||)
kalaśhāburamugāḍa kaṁduvadoḍala nīḍa
vĕlayusu nunnavām̐ḍu vīm̐ḍĕ hanumaṁtum̐ḍu
(||kala||)
tāḍiṁṭi paṁḍlagŏla dābari sedam̐ baṭṭaga
vāḍamai daityulam̐ gŏṭṭa valasĕ yĕtti
gām̐ṭāna śhirasubaigi gakkanam̐ dom̐ka nikkiṁchi
yeḍiyai nilusunnām̐ḍu miṁchi hanumaṁtum̐ḍu
(||kala||)
bālasūryabiṁbamunu paṁḍugānu bhāviṁchi
sālugŏnam̐ bādamula jaṁga sām̐si
kolumuṁdugā satva gūḍa nura mubbiṁchi
nelā minnū mosinām̐ḍu niṁḍi hanumaṁtum̐ḍu
(||kala||)
muṁchina pradābamuna mŏgamu bigiṁchugŏni
aṁchĕla nanniḍānu jayamunam̐ bŏṁdi
yĕṁcham̐ga śhrīveṁkaḍeśhu kidavari dāsum̐ḍai
maṁchi varamu lichchīni māgu hanumaṁtum̐ḍu