Kalanainaa kshanamainaa

కలనైనా క్షణమైనా
Year
Language

పల్లవి:

కలనైనా క్షణమైనా మాయనిదే
మన ప్రేమా మన ప్రేమా
కలకాలం కావ్యంలా నిలిచేదే
మన ప్రేమా మన ప్రేమా

చరణం 1:

నీ కళ్ళల్లో తొంగి చూడనిదే
నిదురేది ఆ రేయి నా కళ్ళకు (2)

నీ పాట మనసారా పాడనిదే
నిలకడ ఏదీ నా మనసుకూ (2)

ఊపిరిలో.. ఊపిరిలా.. ఒదిగేదే.. మన ప్రేమా

చరణం 2:

నా చెంపకు ఎంతటి ఉబలాటమో
నీ చెంపతో చెలగాటమాడాలని (2)

నా పెదవికి ఎంతటి ఆరాటమో
నీ పెదవిపై శుభలేఖ రాయాలని (2)

కౌగిలిలో.. కౌగిలిలా.. కరిగేదే.. మన ప్రేమా

pallavi:

kalanainā kṣhaṇamainā māyanide
mana premā mana premā
kalagālaṁ kāvyaṁlā nilisede
mana premā mana premā

saraṇaṁ 1:

nī kaḽḽallo tŏṁgi sūḍanide
niduredi ā reyi nā kaḽḽagu (2)

nī pāḍa manasārā pāḍanide
nilagaḍa edī nā manasugū (2)

ūbirilo.. ūbirilā.. ŏdigede.. mana premā

saraṇaṁ 2:

nā sĕṁpagu ĕṁtaḍi ubalāḍamo
nī sĕṁpado sĕlagāḍamāḍālani (2)

nā pĕdavigi ĕṁtaḍi ārāḍamo
nī pĕdavibai śhubhalekha rāyālani (2)

kaugililo.. kaugililā.. karigede.. mana premā