Kalamaamta seppe needo kallalaadaneram gaani

కలమాఁట చెప్పే నీతో కల్లలాడనేరఁ గాని
Language

(॥పల్లవి॥)
కలమాఁట చెప్పే నీతో కల్లలాడనేరఁ గాని
చెలఁగి కడపలోన చిత్తగించవయ్యా

(॥కల॥)
కపట మించుకలేదు కాఁతాళమే వుండీఁగాని
వుపమల నన్నేల వొరసేవయ్యా
నెపములు వేయ నీపై నిందలే మోచీఁగాని
చపలచిత్తము మాని చక్కవినవయ్యా

(॥కల॥)
జగడ మింతాఁ దీరె చనవు మెరసేఁగాని
నగుతానే నన్నేల నమ్మించేవయ్యా
పగటులు చూప నీతో పంతమే నెరపేఁగాని
మొగము చూతువుగాని ముందట నుండవయ్యా

(॥కల॥)
కోపములెల్లాఁ బాసె కొనగోరే నాఁటేఁగాని
తీపులు నీవేఁటికి సాదించేవయ్యా
యేపున నిన్ను శ్రీవేంకటేశ నేఁ గూడితిఁగాని
చేపట్టితి విదె నీవు సిగ్గువడవయ్యా

(||pallavi||)
kalamām̐ṭa sĕppe nīdo kallalāḍaneram̐ gāni
sĕlam̐gi kaḍabalona sittagiṁchavayyā

(||kala||)
kabaḍa miṁchugaledu kām̐tāḽame vuṁḍīm̐gāni
vubamala nannela vŏrasevayyā
nĕbamulu veya nībai niṁdale mosīm̐gāni
sabalasittamu māni sakkavinavayyā

(||kala||)
jagaḍa miṁtām̐ dīrĕ sanavu mĕrasem̐gāni
nagudāne nannela nammiṁchevayyā
pagaḍulu sūba nīdo paṁtame nĕrabem̐gāni
mŏgamu sūduvugāni muṁdaḍa nuṁḍavayyā

(||kala||)
kobamulĕllām̐ bāsĕ kŏnagore nām̐ṭem̐gāni
tībulu nīvem̐ṭigi sādiṁchevayyā
yebuna ninnu śhrīveṁkaḍeśha nem̐ gūḍidim̐gāni
sebaṭṭidi vidĕ nīvu sigguvaḍavayyā