Kalagooraa valabemi ganamugaam gosaramga

కలగూరా వలపేమి గనముగాఁ గొసరఁగ
Language

(॥పల్లవి॥)
కలగూరా వలపేమి గనముగాఁ గొసరఁగ
పలుకుఁబంతము నొకపాటి గావలదా

(॥కల॥)
చలమే ప(ఫ)లమా సారె సారె రమణుఁడు
పిలిచితే రారాదాబిగియనేల
కలయక మానేరా కాఁపిరాలు సేసేవారు
చెలికత్తియలచేతఁ జెప్పించుకొందురా

(॥కల॥)
చెక్కుచేయే సింగారమా చేరెతఁడు మాటాడఁగా
గక్కన మాటాడరాదా కమ్మటి నీవు
వొక్కటిగాక మానేరా వొడఁబాటుగలవారు
వుక్కటగా వట్టిరాఁపులు సేసుకొందురా

(॥కల॥)
మంకుఁదనమే వుంకువా మరి శ్రీవేంకటేశుఁడు
సంకెదీర నిన్నుఁగూడె చన వీరాదా
అంకెగాక మానేరా ఆలుమగఁడైన వారు
సుంకముగార దమలోన సలయించుకొందురా

(||pallavi||)
kalagūrā valabemi ganamugām̐ gŏsaram̐ga
palugum̐baṁtamu nŏgabāḍi gāvaladā

(||kala||)
salame pa(pha)lamā sārĕ sārĕ ramaṇum̐ḍu
piliside rārādābigiyanela
kalayaga mānerā kām̐pirālu sesevāru
sĕligattiyalasedam̐ jĕppiṁchugŏṁdurā

(||kala||)
sĕkkuseye siṁgāramā serĕdam̐ḍu māḍāḍam̐gā
gakkana māḍāḍarādā kammaḍi nīvu
vŏkkaḍigāga mānerā vŏḍam̐bāḍugalavāru
vukkaḍagā vaṭṭirām̐pulu sesugŏṁdurā

(||kala||)
maṁkum̐daname vuṁkuvā mari śhrīveṁkaḍeśhum̐ḍu
saṁkĕdīra ninnum̐gūḍĕ sana vīrādā
aṁkĕgāga mānerā ālumagam̐ḍaina vāru
suṁkamugāra damalona salayiṁchugŏṁdurā