(॥పల్లవి॥)
కలది గలట్టె యాడు కాదనేమా
నిలుకడైన పనికి నీ కేల వెఱపు
(॥కల॥)
సానఁబట్టకు చూపులు సాధించెనఁటా నాపై
ఆనలు వెట్టకు మరి అది దోసము
నానఁబెట్ట కంతేసి నవ్వులు నా మోము చూచి
నే నేమఁ(మం?) టిని నిన్ను నీకేల వెఱపు
(॥కల॥)
కోపగించ కంత నీవు కొచ్చికొచ్చి యడగితే
పైపై సాకిరి యేల బయలయ్యీని
మోపుగట్ట కంత నీవు మొక్కులు యేకత మవునా
నీపంతము లీడేరె నీకేల వెఱవు
(॥కల॥)
వేగిరించ కంత నిన్ను వింతుగాఁ బొగడితే
సాగఁబెట్టకు బొంకులు చవులు గావు
బాగుగా శ్రీవేంకటేశ పంతాన నన్నేలితివి
నీగుణము చక్కనాయ నీకేల వెఱపు
(||pallavi||)
kaladi galaṭṭĕ yāḍu kādanemā
nilugaḍaina panigi nī kela vĕṟabu
(||kala||)
sānam̐baṭṭagu sūbulu sādhiṁchĕnam̐ṭā nābai
ānalu vĕṭṭagu mari adi dosamu
nānam̐bĕṭṭa kaṁtesi navvulu nā momu sūsi
ne nemam̐(maṁ?) ṭini ninnu nīgela vĕṟabu
(||kala||)
kobagiṁcha kaṁta nīvu kŏchchigŏchchi yaḍagide
paibai sāgiri yela bayalayyīni
mobugaṭṭa kaṁta nīvu mŏkkulu yegada mavunā
nībaṁtamu līḍerĕ nīgela vĕṟavu
(||kala||)
vegiriṁcha kaṁta ninnu viṁtugām̐ bŏgaḍide
sāgam̐bĕṭṭagu bŏṁkulu savulu gāvu
bāgugā śhrīveṁkaḍeśha paṁtāna nannelidivi
nīguṇamu sakkanāya nīgela vĕṟabu