(॥పల్లవి॥)
కక్కసించనేమిటికే కాంతలాల
మక్కువ సేసెను తొల్లె మన్నించీఁగాక
(॥కక్క॥)
నామోము తాఁ జూచితేను నవ్వులు నవ్వేఁగాక
వేమారుఁ బైకొంటేను వేసట గాదా
చేముట్టి చెనకితేను సేవలు సేసేఁగాక
ఆముకొని కొసరితే నందము లయ్యీనా
(॥కక్క॥)
పేరుకొని పిలిచితే బెట్టి వూఁకొనేఁగాక
వూరకే మాఁటాడితేను వొద్దికయ్యీనా
తారుకాణ వచ్చితేనే తన్ను నెచ్చరించేఁగాక
సారె సారెఁ బెనఁగితే చాయకు వచ్చీనా
(॥కక్క॥)
కావలెననిన దాఁకా కాచుకవుండేఁగాక
యీవల వేగిరించితే నిచ్చక మౌనా
చేవదేర నన్నుఁ గూడె శ్రీవేంకటేశుఁడు నేఁడు
కావరించితే నిట్లా కళలు రేఁగీనా
(||pallavi||)
kakkasiṁchanemiḍige kāṁtalāla
makkuva sesĕnu tŏllĕ manniṁchīm̐gāga
(||kakka||)
nāmomu tām̐ jūsidenu navvulu navvem̐gāga
vemārum̐ baigŏṁṭenu vesaḍa gādā
semuṭṭi sĕnagidenu sevalu sesem̐gāga
āmugŏni kŏsaride naṁdamu layyīnā
(||kakka||)
perugŏni piliside bĕṭṭi vūm̐kŏnem̐gāga
vūrage mām̐ṭāḍidenu vŏddigayyīnā
tārugāṇa vachchidene tannu nĕchchariṁchem̐gāga
sārĕ sārĕm̐ bĕnam̐gide sāyagu vachchīnā
(||kakka||)
kāvalĕnanina dām̐kā kāsugavuṁḍem̐gāga
yīvala vegiriṁchide nichchaga maunā
sevadera nannum̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu nem̐ḍu
kāvariṁchide niṭlā kaḽalu rem̐gīnā