కైకొనేఁగాక నేనిట్టె కాదనక
(॥పల్లవి॥)
కైకొనేఁగాక నేనిట్టె కాదనక
దీకొని నీసుద్దులు నేఁ దెలియనివా
(॥కైకొ॥)
పువ్వువలె నాపె నీ పొంత నుండితేఁజాలు
యెవ్వరితోడి సడ్డ యేలనాకు
పవ్వళించి మాతో పని పయిప చారము లింతే
నివ్వటిల్లు నీతో పొందు నేనెఱఁగనా
(॥కైకొ॥)
మొక్కు మొక్కి యాపె నీమోము చూచితేఁజాలు
యెక్కడెక్కడిసతులు యెంత లేదు
మొక్కలపు మాకొలువు మూకపాపులకు నింతే
చొక్కపు నీ గుణములు సోదించనివా
(॥కైకొ॥)
వుడివోక ఆపె నీవురముపై నుంటేఁజాలు
యెడపుల వారెల్లా నేమి బాఁతి
నడుమ శ్రీ వేంకటేశ నన్ను నిట్టె కూడితివి
తడవి నీమేలు నేఁ దలఁచనిదా
(||pallavi||)
kaigŏnem̐gāga neniṭṭĕ kādanaga
dīgŏni nīsuddulu nem̐ dĕliyanivā
(||kaigŏ||)
puvvuvalĕ nābĕ nī pŏṁta nuṁḍidem̐jālu
yĕvvaridoḍi saḍḍa yelanāgu
pavvaḽiṁchi mādo pani payiba sāramu liṁte
nivvaḍillu nīdo pŏṁdu nenĕṟam̐ganā
(||kaigŏ||)
mŏkku mŏkki yābĕ nīmomu sūsidem̐jālu
yĕkkaḍĕkkaḍisadulu yĕṁta ledu
mŏkkalabu māgŏluvu mūgabābulagu niṁte
sŏkkabu nī guṇamulu sodiṁchanivā
(||kaigŏ||)
vuḍivoga ābĕ nīvuramubai nuṁṭem̐jālu
yĕḍabula vārĕllā nemi bām̐ti
naḍuma śhrī veṁkaḍeśha nannu niṭṭĕ kūḍidivi
taḍavi nīmelu nem̐ dalam̐sanidā