కడుఁగడు ముద్దరాలు కామిని నీకు మేలుది
(॥పల్లవి॥)
కడుఁగడు ముద్దరాలు కామిని నీకు మేలుది
అడుగవయ్యా నీవేయైనా నాపె మనవి
(॥॥)
పడఁతి సిగ్గున విన్నపము సేయకున్న దేమో
వడి నిన్నంటికిఁ బిలువఁగ వచ్చెను
వొడికాన వేళ చూచుకున్నభావమో యేమో
చిడుముడి చెక్కుచేతఁ జిమ్మి రేఁగుచున్నది
(॥॥)
అట్టె మానాపతి గాన అడఁకువ నున్నదేమో
గుట్టునఁ గానుక చేతఁ బట్టుకున్నది
దిట్టయై నీతలఁపులు దెలియవలసియేమో
యెట్టయెదుటనుఁ జేతులెత్తి మొక్కుచున్నది
(॥॥)
యేకతాన నూడిగాలు ఇట్టె సేసేనంటానేమో
దాకొని నీపానుపుదండ నున్నది
యీకె నింతలో శ్రీ వేంకటేశుఁడ కూడితివి
మేకొని నిన్నన్నిటాను మెచ్చుకొంటా నున్నది
(||pallavi||)
kaḍum̐gaḍu muddarālu kāmini nīgu meludi
aḍugavayyā nīveyainā nābĕ manavi
(||||)
paḍam̐ti sigguna vinnabamu seyagunna demo
vaḍi ninnaṁṭigim̐ biluvam̐ga vachchĕnu
vŏḍigāna veḽa sūsugunnabhāvamo yemo
siḍumuḍi sĕkkusedam̐ jimmi rem̐gusunnadi
(||||)
aṭṭĕ mānābadi gāna aḍam̐kuva nunnademo
guṭṭunam̐ gānuga sedam̐ baṭṭugunnadi
diṭṭayai nīdalam̐pulu dĕliyavalasiyemo
yĕṭṭayĕduḍanum̐ jedulĕtti mŏkkusunnadi
(||||)
yegadāna nūḍigālu iṭṭĕ sesenaṁṭānemo
dāgŏni nībānubudaṁḍa nunnadi
yīgĕ niṁtalo śhrī veṁkaḍeśhum̐ḍa kūḍidivi
megŏni ninnanniḍānu mĕchchugŏṁṭā nunnadi