Kadumedi javaraalu kaligisemtala keelu

కడుమేటి జవరాలు కలికిచేఁతల కీలు
Language

(॥పల్లవి॥)
కడుమేటి జవరాలు కలికిచేఁతల కీలు
పిడికిటి తలఁబాలు పెట్టీ నీకెఁ జూడరే

(॥కడు॥)
కన్నుల చూపులతేట కమ్ముఁజెమటలవూట
పిన్నమొగముపై గొప్పు పెట్టినికోట
యెన్నఁగఁ గంఠనాదము ఇమ్ముల కోవిలపాట
యెన్నిటికి గురియాయ నింతిఁ జూడరే

(॥కడు॥)
జక్కవచన్నుల వొప్పు చక్కఁదనముల చొప్పు
పక్కన జారిననునుఁ బయ్యద కప్పు
అక్కజపునె న్నడుము అరిది సింగమునెప్పు
యిక్కువైన సింగారాల యీకెఁ జూడరే

(॥కడు॥)
సెలవి నవ్వుల నిగ్గు చిప్పిలు రతులసిగ్గు
కెలఁకుల మోవిమీఁదికెంపులకగ్గు
యెలమి శ్రీ వేంకటేశుఁ డిప్పుడిట్టె యీకెఁ గూడె
వెలలేని వేడుకల వెలఁదిఁ జూడరే

(||pallavi||)
kaḍumeḍi javarālu kaligisem̐tala kīlu
piḍigiḍi talam̐bālu pĕṭṭī nīgĕm̐ jūḍare

(||kaḍu||)
kannula sūbuladeḍa kammum̐jĕmaḍalavūḍa
pinnamŏgamubai gŏppu pĕṭṭinigoḍa
yĕnnam̐gam̐ gaṁṭhanādamu immula kovilabāḍa
yĕnniḍigi guriyāya niṁtim̐ jūḍare

(||kaḍu||)
jakkavasannula vŏppu sakkam̐danamula sŏppu
pakkana jārinanunum̐ bayyada kappu
akkajabunĕ nnaḍumu aridi siṁgamunĕppu
yikkuvaina siṁgārāla yīgĕm̐ jūḍare

(||kaḍu||)
sĕlavi navvula niggu sippilu radulasiggu
kĕlam̐kula movimīm̐digĕṁpulagaggu
yĕlami śhrī veṁkaḍeśhum̐ ḍippuḍiṭṭĕ yīgĕm̐ gūḍĕ
vĕlaleni veḍugala vĕlam̐dim̐ jūḍare