Kadu valasinadaanim gaagu seduraa

కడు వలచినదానిఁ గాకు సేతురా
Language

(॥పల్లవి॥)
కడు వలచినదానిఁ గాకు సేతురా
యెడయక మన్నించి యేలుదురుగాక

(॥కడు॥)
చక్కెర పంటి మోవి చవిచూడవచ్చితేను
చుక్కలెట్టు నించితివి సుదతికిని
నిక్కి చూచి చేతు లెత్తి నీకు నిట్టె మొక్కితేను
జక్కవ చన్నులేల సారెఁ బిసికేవు

(॥కడు॥)
వేడుకతో నీకు నిట్టె విన్నపాలు సేయఁగానే
కూడఁబట్టి చెక్కులేల గోర గీరేవు
వాడికతోఁ బాదాలొత్తి వావులు చెప్పఁగాను
మేడెపురతుల నెంత మేలమాడేవు

(॥కడు॥)
వెన్నెల నవ్వులు నీతో వేమారు నవ్వేనంటా
పన్నుక మొలనూ లేల పట్టి తీసేవు
యిన్నిటా శ్రీవేంకటేశ యీకె నీకు దేవులంటా
మన్నించితి వింకా నేమి మర్మము లంటేవు

(||pallavi||)
kaḍu valasinadānim̐ gāgu sedurā
yĕḍayaga manniṁchi yeludurugāga

(||kaḍu||)
sakkĕra paṁṭi movi savisūḍavachchidenu
sukkalĕṭṭu niṁchidivi sudadigini
nikki sūsi sedu lĕtti nīgu niṭṭĕ mŏkkidenu
jakkava sannulela sārĕm̐ bisigevu

(||kaḍu||)
veḍugado nīgu niṭṭĕ vinnabālu seyam̐gāne
kūḍam̐baṭṭi sĕkkulela gora gīrevu
vāḍigadom̐ bādālŏtti vāvulu sĕppam̐gānu
meḍĕburadula nĕṁta melamāḍevu

(||kaḍu||)
vĕnnĕla navvulu nīdo vemāru navvenaṁṭā
pannuga mŏlanū lela paṭṭi tīsevu
yinniḍā śhrīveṁkaḍeśha yīgĕ nīgu devulaṁṭā
manniṁchidi viṁkā nemi marmamu laṁṭevu