Kadanunnavaaru nene garvinamduru

కడనున్నవారు నేనే గర్వినందురు
Language

(॥పల్లవి॥)
కడనున్నవారు నేనే గర్వినందురు
కడురట్టు సుమ్మమ్మ కతలు యీతనివి

(॥కడ॥)
వేడుకలు దైవారె వెంగెములు మేన నిండె
యేడవారితో గొడవలేల తనకు
వాడికకు వచ్చితిమి వలసీ నొల్లనిపతిఁ
జూడరమ్మ చెలులాల సుద్దులు యీతనివి

(॥కడ॥)
కళలు మోమున మించె కాఁపురాలు వెంటవచ్చె
పలువుర మీఁద నెల్ల బాఁతియేఁటికి
వలచినదాన నేను వాసులు వెదకీఁదాను
తెలుసుకోరమ్మ మీరు తేటల యీ మాటలు

(॥కడ॥)
రచ్చఁబడెఁ దమకాలు రతికెక్కె వయసులు
తచ్చనల కిఁక నేమి తతి గాదు
పచ్చిగాఁ గూడితి నేను భ్రమసె శ్రీ వేంకటేశుఁ
డెచ్చటఁ దలఁచరమ్మ యీతని భావములు

(||pallavi||)
kaḍanunnavāru nene garvinaṁduru
kaḍuraṭṭu summamma kadalu yīdanivi

(||kaḍa||)
veḍugalu daivārĕ vĕṁgĕmulu mena niṁḍĕ
yeḍavārido gŏḍavalela tanagu
vāḍigagu vachchidimi valasī nŏllanibadim̐
jūḍaramma sĕlulāla suddulu yīdanivi

(||kaḍa||)
kaḽalu momuna miṁchĕ kām̐purālu vĕṁṭavachchĕ
paluvura mīm̐da nĕlla bām̐tiyem̐ṭigi
valasinadāna nenu vāsulu vĕdagīm̐dānu
tĕlusugoramma mīru teḍala yī māḍalu

(||kaḍa||)
rachcham̐baḍĕm̐ damagālu radigĕkkĕ vayasulu
tachchanala kim̐ka nemi tadi gādu
pachchigām̐ gūḍidi nenu bhramasĕ śhrī veṁkaḍeśhum̐
ḍĕchchaḍam̐ dalam̐saramma yīdani bhāvamulu