కడమ లెక్కడి విఁక కానవచ్చిన పనికి
(॥పల్లవి॥)
కడమ లెక్కడి విఁక కానవచ్చిన పనికి
జడిసి దోమటి విందు చవివుట్టీనా
(॥కడ॥)
మానిని మాటలే నీకు మదన రహస్యములు
నానఁగా నిన్న వెడుగ నాకుఁ దగవా
తేనెగారే అధరపు తేనెలు నీ తలకెక్కె
వీనుల(లు) వూరఁగతలు వినఁగూడీనా
(॥కడ॥)
యింతి కానుకలు నీకు యిచ్చిన సంచకరువు
దొంతులైన వవి మాకు తోయవసమా
చెంతల నెగరవేయ చేతులకు నీకుఁ జిక్కె
యెంతవారు పిలిచినా నియ్యకొనేవా
(॥కడ॥)
పొలిఁతిఁ కాఁగిలి నీకు భోగపు పెండ్లి చవికె
చెలులము మా యెదుట సిగ్గు వడేవా
కలగంపలాయఁ బొందు కడపలోపల నేఁడు
అలరి శ్రీ వేంకటేశ అడ్డమాడేవా
(||pallavi||)
kaḍama lĕkkaḍi vim̐ka kānavachchina panigi
jaḍisi domaḍi viṁdu savivuṭṭīnā
(||kaḍa||)
mānini māḍale nīgu madana rahasyamulu
nānam̐gā ninna vĕḍuga nāgum̐ dagavā
tenĕgāre adharabu tenĕlu nī talagĕkkĕ
vīnula(lu) vūram̐gadalu vinam̐gūḍīnā
(||kaḍa||)
yiṁti kānugalu nīgu yichchina saṁchagaruvu
dŏṁtulaina vavi māgu toyavasamā
sĕṁtala nĕgaraveya sedulagu nīgum̐ jikkĕ
yĕṁtavāru pilisinā niyyagŏnevā
(||kaḍa||)
pŏlim̐tim̐ kām̐gili nīgu bhogabu pĕṁḍli savigĕ
sĕlulamu mā yĕduḍa siggu vaḍevā
kalagaṁpalāyam̐ bŏṁdu kaḍabalobala nem̐ḍu
alari śhrī veṁkaḍeśha aḍḍamāḍevā