కటకటా వట్టిదూరు కట్టుకొందురా
(॥పల్లవి॥)
కటకటా వట్టిదూరు కట్టుకొందురా
సటలు సేయఁగనేలే జవరాలికి
(॥కట॥)
అలుకలేమి గల్లాను అప్పటి కప్పుడే కాక
చలపాది తనమేలే సతికి
బలిమి నొడఁబరచే పతిమాఁట వింటకాక
పెలుచుఁ దనము లేలే ప్రియురాలికి
(॥కట॥)
వొట్టిడుకొంటే వెనక నోజకు వచ్చుటగాక
గట్టువాయతనమేలే కామినికి
చుట్టమైన పతిమోము చూచితే లోఁగుట కాక
వెట్టఁ బొరలఁగనేలే వెలఁదికిని
(॥కట॥)
పంతములాడుకొంటేను పైఁకొని మెచ్చుటగాక
వంతులు వాసులు నేలే వనితకు
బంతినే శ్రీ వేంకటాద్రి పతి నిన్నుఁ గూడె నిదె
పొంతనా లింకా నేలె పొలఁతికిని
(||pallavi||)
kaḍagaḍā vaṭṭidūru kaṭṭugŏṁdurā
saḍalu seyam̐ganele javarāligi
(||kaḍa||)
alugalemi gallānu appaḍi kappuḍe kāga
salabādi tanamele sadigi
balimi nŏḍam̐barase padimām̐ṭa viṁṭagāga
pĕlusum̐ danamu lele priyurāligi
(||kaḍa||)
vŏṭṭiḍugŏṁṭe vĕnaga nojagu vachchuḍagāga
gaṭṭuvāyadanamele kāminigi
suṭṭamaina padimomu sūside lom̐guḍa kāga
vĕṭṭam̐ bŏralam̐ganele vĕlam̐digini
(||kaḍa||)
paṁtamulāḍugŏṁṭenu paim̐kŏni mĕchchuḍagāga
vaṁtulu vāsulu nele vanidagu
baṁtine śhrī veṁkaḍādri padi ninnum̐ gūḍĕ nidĕ
pŏṁtanā liṁkā nelĕ pŏlam̐tigini