Kadagadaa meemdadi kada(ta?) yemdo

కటకటా మీఁదటి కద(త?) యెందో
Language

(॥పల్లవి॥)
కటకటా మీఁదటి కద(త?) యెందో
తటుకునఁ బతి దయదలచఁగవలదా

(॥కట॥)
కంచుమించులగుగగనపునడు మిది
అంచగమనమే ఆధరువు
పొంచినఆరునఁ బొదుపుసేసుకొని
వుంచపుగట్టున నున్నదిగాక

(॥కట॥)
నిగ్గులు నీడలు నెలఁతవదన మిది
యెగ్గుసిగ్గులకు నెడగలదా
బెగ్గిలి కన్నులఁ బెద్దసేసుకొని
ముగ్గులనవ్వుల మురిసీఁగాక

(॥కట॥)
పరువపుగరువపుపాయపుమన సిది
తరుణియాసకే దరిదాపు
యెరవుగ శ్రీవేంకటేశుఁడు గూడఁగ
సరవు లివిన్నియు జయమయి నిలిచె

(||pallavi||)
kaḍagaḍā mīm̐daḍi kada(ta?) yĕṁdo
taḍugunam̐ badi dayadalasam̐gavaladā

(||kaḍa||)
kaṁchumiṁchulagugaganabunaḍu midi
aṁchagamaname ādharuvu
pŏṁchinaārunam̐ bŏdubusesugŏni
vuṁchabugaṭṭuna nunnadigāga

(||kaḍa||)
niggulu nīḍalu nĕlam̐tavadana midi
yĕggusiggulagu nĕḍagaladā
bĕggili kannulam̐ bĕddasesugŏni
muggulanavvula murisīm̐gāga

(||kaḍa||)
paruvabugaruvabubāyabumana sidi
taruṇiyāsage daridābu
yĕravuga śhrīveṁkaḍeśhum̐ḍu gūḍam̐ga
saravu livinniyu jayamayi nilisĕ