Kadagadaa maamaamta kaadamduraa

కటకటా మామాఁట కాదందురా
Language

(॥పల్లవి॥)
కటకటా మామాఁట కాదందురా
కుటిలకుంతలివి(లవు?) యీగుణ మేఁటికే నీకు

(॥కట॥)
చాలుఁజాలు చలము నీకు! పతి నింత
నాలిఁబెట్టుట నాయమా
వాలుఁజూపులు వంచెఁ గదవే! అతనిపై-
నేలే అలుకులు యింతలో నీకు

(॥కట॥)
మానగదవె మంకులింకా! పతిగుణము
కానకే కలఁగఁదగునా
ఆనవెట్టె నతఁడు నేఁడు! తప్పదనె
మోనమున పతి కింక మొక్కఁగదవె మగువా

(॥కట॥)
యింకాఁ దగదు యెరవు లింతా! కూడె నిదె
కొంకక శ్రీవేంకటేశుఁడు
వంక లొత్త మాకునేల వడి నీకుఁ బోదు
కంకణము లిద్దరికిఁ గలిగెఁగదె మగువా

(||pallavi||)
kaḍagaḍā māmām̐ṭa kādaṁdurā
kuḍilaguṁtalivi(lavu?) yīguṇa mem̐ṭige nīgu

(||kaḍa||)
sālum̐jālu salamu nīgu! padi niṁta
nālim̐bĕṭṭuḍa nāyamā
vālum̐jūbulu vaṁchĕm̐ gadave! adanibai-
nele alugulu yiṁtalo nīgu

(||kaḍa||)
mānagadavĕ maṁkuliṁkā! padiguṇamu
kānage kalam̐gam̐dagunā
ānavĕṭṭĕ nadam̐ḍu nem̐ḍu! tappadanĕ
monamuna padi kiṁka mŏkkam̐gadavĕ maguvā

(||kaḍa||)
yiṁkām̐ dagadu yĕravu liṁtā! kūḍĕ nidĕ
kŏṁkaga śhrīveṁkaḍeśhum̐ḍu
vaṁka lŏtta māgunela vaḍi nīgum̐ bodu
kaṁkaṇamu liddarigim̐ galigĕm̐gadĕ maguvā