Kabadabu nee suddulu kannave kaavaa

కపటపు నీ సుద్దులు కన్నవే కావా
Language

(॥పల్లవి॥)
కపటపు నీ సుద్దులు కన్నవే కావా
నెపమున నీనేరుపు నెఱపఁగవలెనా

(॥కప॥)
నేనూ నాతఁడూ నొకటే నీవేమిచెప్పేవే
కానీలేవే యింతయేల కాఁతాళించేవే
దానికేమే సవతివౌత యెఱఁగరా నిన్ను
సోనలుగావలపులు చొరవేయవలెనా

(॥కప॥)
ఆతఁడు నన్ను మన్నించు నందు కేమిసేసేవే
రాతిరిఁబగలునేల రాఁపుసేసేవే
గాతల నీకుఁ బొత్తుగలుగుట చూపనేల
యీతరవాతనే నీవు యింత నవ్వవలెనా

(॥కప॥)
శ్రీవేంకటేశుఁడు నన్నుఁ జెనకి కాఁగిటఁ గూడె
కావించి నీవిట్టె ఇచ్చకములాడవే
వాని నీకుఁ గలుగుట వాడవారే యెఱఁగరా
దేవరవలెనే ఇంత తెలుపఁగవలెనా

(||pallavi||)
kabaḍabu nī suddulu kannave kāvā
nĕbamuna nīnerubu nĕṟabam̐gavalĕnā

(||kaba||)
nenū nādam̐ḍū nŏgaḍe nīvemisĕppeve
kānīleve yiṁtayela kām̐tāḽiṁcheve
dānigeme savadivauda yĕṟam̐garā ninnu
sonalugāvalabulu sŏraveyavalĕnā

(||kaba||)
ādam̐ḍu nannu manniṁchu naṁdu kemiseseve
rādirim̐bagalunela rām̐puseseve
gādala nīgum̐ bŏttugaluguḍa sūbanela
yīdaravādane nīvu yiṁta navvavalĕnā

(||kaba||)
śhrīveṁkaḍeśhum̐ḍu nannum̐ jĕnagi kām̐giḍam̐ gūḍĕ
kāviṁchi nīviṭṭĕ ichchagamulāḍave
vāni nīgum̐ galuguḍa vāḍavāre yĕṟam̐garā
devaravalĕne iṁta tĕlubam̐gavalĕnā