కానీవయ్య నీమేలు గైకొంటిని
(॥పల్లవి॥)
కానీవయ్య నీమేలు గైకొంటిని
సానఁ బట్టిన చూపుల సంతసించే నిఁకను
(॥కానీ॥)
చెప్పినట్టల్లా నీవు సేయని వాఁడవా నాకు
చెప్పుడు బుద్దుల యింత సేసేవు గాక
తప్పక యిప్పుడైనా దయవుట్టెఁగా నాపై
చప్పుడుగా నవ్వు నవ్వి సంతసించే నిఁకను
(॥కానీ॥)
రట్టుగా మా యింటికి నీవిట్టె రానివాఁడవా
పెట్టెడి వారి భ్రమలఁ బెద్దయితి గాక
గట్టిగా నేడైనాను కరుణించితి గా నన్ను
జట్టిగొని నిన్ను మెచ్చి సంతసించే నిఁకను
(॥కానీ॥)
పెనఁగేవేళ నీ వింత బిరుదులాడేవాఁడవా
వొనరు నేస్తాలవారి వోజలు గాక
యెనసితి శ్రీ వేంకటేశ నన్ను మన్నించితి
చనవులు మెఱయుచు సంతసించే నిఁకను
(||pallavi||)
kānīvayya nīmelu gaigŏṁṭini
sānam̐ baṭṭina sūbula saṁtasiṁche nim̐kanu
(||kānī||)
sĕppinaṭṭallā nīvu seyani vām̐ḍavā nāgu
sĕppuḍu buddula yiṁta sesevu gāga
tappaga yippuḍainā dayavuṭṭĕm̐gā nābai
sappuḍugā navvu navvi saṁtasiṁche nim̐kanu
(||kānī||)
raṭṭugā mā yiṁṭigi nīviṭṭĕ rānivām̐ḍavā
pĕṭṭĕḍi vāri bhramalam̐ bĕddayidi gāga
gaṭṭigā neḍainānu karuṇiṁchidi gā nannu
jaṭṭigŏni ninnu mĕchchi saṁtasiṁche nim̐kanu
(||kānī||)
pĕnam̐geveḽa nī viṁta birudulāḍevām̐ḍavā
vŏnaru nestālavāri vojalu gāga
yĕnasidi śhrī veṁkaḍeśha nannu manniṁchidi
sanavulu mĕṟayusu saṁtasiṁche nim̐kanu