కానీవయ్య అందుకేమి కైకొంటిని
(॥పల్లవి॥)
కానీవయ్య అందుకేమి కైకొంటిని
యీ నిజమే నెరపితే నెందువోయీఁ బనులు
(॥కానీ॥)
చే పట్టి తీసి నాతోఁ జెలరేఁగి పెనఁగేవు
వోపితేఁ జాలుఁగాక వొద్దనేనా
తీపులెల్లాఁ జిలికించి దిమ్మరిమాట లాడేవు
యీ పట్టుకు నిన్ను మీరి యెందువోయీఁ బనులు
(॥కానీ॥)
వొత్తి నాకుఁ జెప్పరాని వూడిగాలు చెప్పేవు
చిత్తము వచ్చితేఁ జాలు సేవ సే సేను
పొత్తుకుఁ బిలిచి నన్ను పొలఁతుల నంటించేవు
ఇత్తల నీవే నేను యెందువోయీఁ బనులు
(॥కానీ॥)
పానుపుపైఁ గాఁగిలించి పంతాలకుఁ గూడేవు
దానికేమి తలఁచని తలఁపాయను
పూనుక శ్రీ వేంకటేశ భోగించితి మిద్దరము
యీ నయము నీకే చెల్లు నెందువోయీఁ బనులు
(||pallavi||)
kānīvayya aṁdugemi kaigŏṁṭini
yī nijame nĕrabide nĕṁduvoyīm̐ banulu
(||kānī||)
se paṭṭi tīsi nādom̐ jĕlarem̐gi pĕnam̐gevu
vobidem̐ jālum̐gāga vŏddanenā
tībulĕllām̐ jiligiṁchi dimmarimāḍa lāḍevu
yī paṭṭugu ninnu mīri yĕṁduvoyīm̐ banulu
(||kānī||)
vŏtti nāgum̐ jĕpparāni vūḍigālu sĕppevu
sittamu vachchidem̐ jālu seva se senu
pŏttugum̐ bilisi nannu pŏlam̐tula naṁṭiṁchevu
ittala nīve nenu yĕṁduvoyīm̐ banulu
(||kānī||)
pānububaim̐ gām̐giliṁchi paṁtālagum̐ gūḍevu
dānigemi talam̐sani talam̐pāyanu
pūnuga śhrī veṁkaḍeśha bhogiṁchidi middaramu
yī nayamu nīge sĕllu nĕṁduvoyīm̐ banulu