Kaaneevayya amdugemi kaanavachche nee suddulu

కానీవయ్య అందుకేమి కానవచ్చె నీ సుద్దులు
Language

(॥పల్లవి॥)
కానీవయ్య అందుకేమి కానవచ్చె నీ సుద్దులు
గోనాల గొందుల నింత గుట్టు సేసుకొందువా

(॥కానీ॥)
పెనఁగి సారెకు నిన్ను ప్రియురాలు విలువఁగ
కొనగానలనే నీవు కొంకేవు
చెనకులు నీమేనఁజేసెనో యెవ్వతెయైనా
నినుఁగల్లమోవకుంటే నీవిట్లా జేతువా

(॥కానీ॥)
వొగ్గుచు గందము నీకు వువిద వుయ్యరాఁగాను
సిగ్గులుపడుచు చెక్కు చేతఁబెట్టేవు
వెగ్గళమై నీమేన వింతవాసన లున్నవో
యెగ్గులచేఁత లేకుంటే యింతేసి లోఁగుదువా

(॥కానీ॥)
మొక్కి యింతి గూడి నీకు మోవితేనె లియ్యఁగాను
అక్కు మోవఁ దలవంచి అట్టె నవ్వేవు
పక్కన శ్రీవేంకటేశ పలుసోఁకు లున్నవో
తక్కు లింతేసి లేకలుంటే తప్పించుకొందువా

(||pallavi||)
kānīvayya aṁdugemi kānavachchĕ nī suddulu
gonāla gŏṁdula niṁta guṭṭu sesugŏṁduvā

(||kānī||)
pĕnam̐gi sārĕgu ninnu priyurālu viluvam̐ga
kŏnagānalane nīvu kŏṁkevu
sĕnagulu nīmenam̐jesĕno yĕvvadĕyainā
ninum̐gallamovaguṁṭe nīviṭlā jeduvā

(||kānī||)
vŏggusu gaṁdamu nīgu vuvida vuyyarām̐gānu
siggulubaḍusu sĕkku sedam̐bĕṭṭevu
vĕggaḽamai nīmena viṁtavāsana lunnavo
yĕggulasem̐ta leguṁṭe yiṁtesi lom̐guduvā

(||kānī||)
mŏkki yiṁti gūḍi nīgu movidenĕ liyyam̐gānu
akku movam̐ dalavaṁchi aṭṭĕ navvevu
pakkana śhrīveṁkaḍeśha palusom̐ku lunnavo
takku liṁtesi legaluṁṭe tappiṁchugŏṁduvā