Kaaneeraa vori kaaneeraa

కానీరా వోరి కానీరా
Language

(॥పల్లవి॥)
కానీరా వోరి కానీరా
కానీరా అట్టె కానీరా నేఁడు
దానికి మాఁటిచ్చి తప్పవు నీవు

(॥కానీ॥)
విందు నేఁ జెప్పఁగ వెనకతీసేవు
కందువ నీగుట్టు కంటిరా నేను

(॥కానీ॥)
రాయడించి నిన్ను రతికిఁ బిలిచి
చేయి చాఁచినాను చిక్కవు నీవు

(॥కానీ॥)
నావాఁడవై కూడి నవ్వే వాపెతోడ
శ్రీ వేంకటేశ్వర చెల్లుర నీకు

(||pallavi||)
kānīrā vori kānīrā
kānīrā aṭṭĕ kānīrā nem̐ḍu
dānigi mām̐ṭichchi tappavu nīvu

(||kānī||)
viṁdu nem̐ jĕppam̐ga vĕnagadīsevu
kaṁduva nīguṭṭu kaṁṭirā nenu

(||kānī||)
rāyaḍiṁchi ninnu radigim̐ bilisi
seyi sām̐sinānu sikkavu nīvu

(||kānī||)
nāvām̐ḍavai kūḍi navve vābĕdoḍa
śhrī veṁkaḍeśhvara sĕllura nīgu