కానీలేవే నీ విందరికెంటే నెక్కుడా
(॥పల్లవి॥)
కానీలేవే నీ విందరికెంటే నెక్కుడా
నానఁబెట్టి సరిగాఁగఁ నవ్వు నవ్వవలెనా
(॥కానీ॥)
వంతులకే పెనఁగేవు వాసులకే తిరిగేవు
యింతటిలో నీకు నేడు యెమ్మె వచ్చెనా
కాంతలెల్లా వూడిగాలు కడుఁ బతికిఁ జేయఁగా
దొంతరై నీ వితనితొడ యెక్కవలెనా
(॥కానీ॥)
మురిపెమే చూపేవు ముద్దులే గునిసేవు
దొరతనములే నీకు తొట్టుకొనెనా
వరుసకు నాడువారు వచ్చి నిలుచుండఁగాను
వొరసి యీతనిమీఁద నూఁదుకొనవెలనా
(॥కానీ॥)
కప్పురమే యడిగేవు కాఁగిటనే కూడేవు
దప్పితో రతులు మీకుఁ దడఁబడెనా
ఇప్పెడె శ్రీవేంకటేశుఁ డింతతోనె నన్ను నేలె
అప్పుడే యీతనివురమందు నుండవలెనా
(||pallavi||)
kānīleve nī viṁdarigĕṁṭe nĕkkuḍā
nānam̐bĕṭṭi sarigām̐gam̐ navvu navvavalĕnā
(||kānī||)
vaṁtulage pĕnam̐gevu vāsulage tirigevu
yiṁtaḍilo nīgu neḍu yĕmmĕ vachchĕnā
kāṁtalĕllā vūḍigālu kaḍum̐ badigim̐ jeyam̐gā
dŏṁtarai nī vidanidŏḍa yĕkkavalĕnā
(||kānī||)
muribĕme sūbevu muddule gunisevu
dŏradanamule nīgu tŏṭṭugŏnĕnā
varusagu nāḍuvāru vachchi nilusuṁḍam̐gānu
vŏrasi yīdanimīm̐da nūm̐dugŏnavĕlanā
(||kānī||)
kappurame yaḍigevu kām̐giḍane kūḍevu
dappido radulu mīgum̐ daḍam̐baḍĕnā
ippĕḍĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtadonĕ nannu nelĕ
appuḍe yīdanivuramaṁdu nuṁḍavalĕnā