కానీ కానీ పదవే కానవలెఁగా తన్ను
(॥పల్లవి॥)
కానీ కానీ పదవే కానవలెఁగా తన్ను
నేనే తాఁ గావలె నెగులేలే తనకు
(॥కానీ॥)
కలిపించఁ గలఁడట ప్రియము చెప్పఁగలేఁడా
బలువుఁడైతే మాతోఁ బంతమా యిది
వలపంచఁగలఁడట వరుసకు రాలేఁడా
చెలులమైతేనే చెల్లుబడా తనకు
(॥కానీ॥)
చెక్కునొక్కఁ గలఁడట చెప్పినట్టు సేయలేఁడా
అక్కటా యిదీఁగోంత అగడా నేఁడు
మొక్కించుకోఁగలఁడట మొకమోట నుండలేఁడా
పక్కన నేఁ డింతలోనే పగటా తనకు
(॥కానీ॥)
కాఁగిలించఁ గలఁడట కందువ మోవియ్యలేఁడా
వీఁగేటిరతులలోన వేసటా ఇది
యేఁగివచ్చి శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
దాఁగి దాఁగి సిగ్గువడఁ దగవా తనకు
(||pallavi||)
kānī kānī padave kānavalĕm̐gā tannu
nene tām̐ gāvalĕ nĕgulele tanagu
(||kānī||)
kalibiṁcham̐ galam̐ḍaḍa priyamu sĕppam̐galem̐ḍā
baluvum̐ḍaide mādom̐ baṁtamā yidi
valabaṁcham̐galam̐ḍaḍa varusagu rālem̐ḍā
sĕlulamaidene sĕllubaḍā tanagu
(||kānī||)
sĕkkunŏkkam̐ galam̐ḍaḍa sĕppinaṭṭu seyalem̐ḍā
akkaḍā yidīm̐goṁta agaḍā nem̐ḍu
mŏkkiṁchugom̐galam̐ḍaḍa mŏgamoḍa nuṁḍalem̐ḍā
pakkana nem̐ ḍiṁtalone pagaḍā tanagu
(||kānī||)
kām̐giliṁcham̐ galam̐ḍaḍa kaṁduva moviyyalem̐ḍā
vīm̐geḍiradulalona vesaḍā idi
yem̐givachchi śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
dām̐gi dām̐gi sigguvaḍam̐ dagavā tanagu