కానవచ్చిన పనికిఁ గైదివ్వె లిఁకనేల
(॥పల్లవి॥)
కానవచ్చిన పనికిఁ గైదివ్వె లిఁకనేల
తానే యెఱుఁగుఁగాక తతిఁబోర నేలే
(॥కాన॥)
వలపించుకొన్నవాఁడు వచ్చికూడనేరఁడా
కొలచినందె కొలచి కొసరఁగాక
చెలులనంపె నిపుడు చేరవచ్చేననుచు
వొలసినొల్లములకు వొరయఁ జోటేది
(॥కాన॥)
సేసపట్టినవాఁడు చేకొనఁగనేరఁడా
రేసుల తన మనసు రేఁచఁగాక
ఆసలకు నడియాల మంపీ నచటనుండి
తీసిపెట్టయినచోట తెలుప చోటేది
(॥కాన॥)
దగ్గరి వచ్చినవాఁడు తమకించనేరఁడా
అగ్గలపుమాట తను నాడఁగాక
యెగ్గెఱిఁగి శ్రీ వేంకటేశుఁడే నన్నుఁగూడె
సిగ్గువడివున్నచోట చెప్పఁజోటేది
(||pallavi||)
kānavachchina panigim̐ gaidivvĕ lim̐kanela
tāne yĕṟum̐gum̐gāga tadim̐bora nele
(||kāna||)
valabiṁchugŏnnavām̐ḍu vachchigūḍaneram̐ḍā
kŏlasinaṁdĕ kŏlasi kŏsaram̐gāga
sĕlulanaṁpĕ nibuḍu seravachchenanusu
vŏlasinŏllamulagu vŏrayam̐ joḍedi
(||kāna||)
sesabaṭṭinavām̐ḍu segŏnam̐ganeram̐ḍā
resula tana manasu rem̐sam̐gāga
āsalagu naḍiyāla maṁpī nasaḍanuṁḍi
tīsibĕṭṭayinasoḍa tĕluba soḍedi
(||kāna||)
daggari vachchinavām̐ḍu tamagiṁchaneram̐ḍā
aggalabumāḍa tanu nāḍam̐gāga
yĕggĕṟim̐gi śhrī veṁkaḍeśhum̐ḍe nannum̐gūḍĕ
sigguvaḍivunnasoḍa sĕppam̐joḍedi