కానవచ్చె నీ గుణాలు కలవెల్లాను
(॥పల్లవి॥)
కానవచ్చె నీ గుణాలు కలవెల్లాను
నానవేసేవు పొందులు నవ్వుతానే యిపుడు
(॥కాన॥)
నెట్టుకొన్న మోహమైతే నిన్న రాకవుందువా
వెట్టికిఁ గాఁగా నుఁడు విచ్చేసితివి
చుట్టమవైతే నీవు సుద్దులు చెప్పుదువా
బట్టబాయ లీఁదించేవు పనిలేనిపనికి
(॥కాన॥)
ఆయములు గరఁగితే నప్పుడే కూడవా
కాయకముగాఁగాను కాఁక చల్లేవు
చేయంకెకు వచ్చితేను సిగ్గులువడుదువా
మాయలెల్లాఁ జేసేవు మనసుపట్టలేక
(॥కాన॥)
వేడుక గలిగితేను విడెము చేతికియ్యవా
యీడుజాడ గాఁగాను యెమ్మెసేసేవు
పాడితో శ్రీవేంకటేశ పైకొని నన్నేలితివి
జోడుగూడ మన్నించేవు సొంపులెల్లా రేఁగను
(||pallavi||)
kānavachchĕ nī guṇālu kalavĕllānu
nānavesevu pŏṁdulu navvudāne yibuḍu
(||kāna||)
nĕṭṭugŏnna mohamaide ninna rāgavuṁduvā
vĕṭṭigim̐ gām̐gā num̐ḍu vichchesidivi
suṭṭamavaide nīvu suddulu sĕppuduvā
baṭṭabāya līm̐diṁchevu panilenibanigi
(||kāna||)
āyamulu garam̐gide nappuḍe kūḍavā
kāyagamugām̐gānu kām̐ka sallevu
seyaṁkĕgu vachchidenu sigguluvaḍuduvā
māyalĕllām̐ jesevu manasubaṭṭalega
(||kāna||)
veḍuga galigidenu viḍĕmu sedigiyyavā
yīḍujāḍa gām̐gānu yĕmmĕsesevu
pāḍido śhrīveṁkaḍeśha paigŏni nannelidivi
joḍugūḍa manniṁchevu sŏṁpulĕllā rem̐ganu