Kaamtameemda nishtooramu kattaguvayyaa

కాంతమీఁద నిష్టూరము కట్టకువయ్యా
Language

(॥పల్లవి॥)
కాంతమీఁద నిష్టూరము కట్టకువయ్యా
వింతలేడఁ జేసీని విచారించవయ్యా

(॥కాంత॥)
తలఁపు నీమీదఁనే తలవంచుకున్నదింతే
అలుకేడ నున్నదో అంగనకును
వలపు నీమీఁదిదే వాడుదేరీ నింతే మోము
చలము లేడనున్నవి సటలు వద్దయ్యా

(॥కాంత॥)
తగులు నీమీఁదిదే తక్కి సిగ్గువడీ నింతే
యెగసక్కె మేడనుందో ఇందులోనను
నగవు నీమీఁదిదే నానఁబెఁట్టీ నిదె యింతే
పగటు లెక్కడఁ జూపె పచారించవయ్యా

(॥కాంత॥)
చేతులు నీమీఁదిదే చిత్తము తెలిసీ నింతే
ఘాత యాడనున్నాడో కలది యిది
యీతల శ్రీ వేంకటేశ యింతి నిట్టె కూడితివి
నీతి యెక్కడ నున్నది నీవు జాణవయ్యా

(||pallavi||)
kāṁtamīm̐da niṣhṭūramu kaṭṭaguvayyā
viṁtaleḍam̐ jesīni visāriṁchavayyā

(||kāṁta||)
talam̐pu nīmīdam̐ne talavaṁchugunnadiṁte
alugeḍa nunnado aṁganagunu
valabu nīmīm̐dide vāḍuderī niṁte momu
salamu leḍanunnavi saḍalu vaddayyā

(||kāṁta||)
tagulu nīmīm̐dide takki sigguvaḍī niṁte
yĕgasakkĕ meḍanuṁdo iṁdulonanu
nagavu nīmīm̐dide nānam̐bĕm̐ṭṭī nidĕ yiṁte
pagaḍu lĕkkaḍam̐ jūbĕ pasāriṁchavayyā

(||kāṁta||)
sedulu nīmīm̐dide sittamu tĕlisī niṁte
ghāda yāḍanunnāḍo kaladi yidi
yīdala śhrī veṁkaḍeśha yiṁti niṭṭĕ kūḍidivi
nīdi yĕkkaḍa nunnadi nīvu jāṇavayyā