Kaamtalanellaa nokkagaadim gattevimtegaaga

కాంతలనెల్లా నొక్కగాడిఁ గట్టేవింతేకాక
Language

(॥పల్లవి॥)
కాంతలనెల్లా నొక్కగాడిఁ గట్టేవింతేకాక
మంతనమాడితేనే మర్మము గరఁగునా

(॥॥)
తలఁపే కలిగితే దండనుండవా నీవు
వలచినవాఁడవై తే వాసులెంతువా
నెల కొకమాటు వచ్చి నిద్రతెంకి నుండఁగాను
తెలిసెనా నాగుణము తేటతెల్లమిగను

(॥॥)
చుట్టరిక మెఱిఁగితే సులభాన నవ్వవా
గుట్టుగన్నవాఁడవైతే కొంచివుందువా
యెట్టకేల కిటు మాతో యేలాటా లాడితేనే
పట్టెనా నీమనసున పంతపునాసేవలు

(॥॥)
కరుణించవలసితే కప్పురమిడె మియ్యెవా
సరసానకు లోనైతే సమ్మతించవా
యిరవై శ్రీవేంకటేశ యిట్టె నన్ను నేలితివి
సరివచ్చెనా తొల్లిటి సంగాతపు రతులు

(||pallavi||)
kāṁtalanĕllā nŏkkagāḍim̐ gaṭṭeviṁtegāga
maṁtanamāḍidene marmamu garam̐gunā

(||||)
talam̐pe kaligide daṁḍanuṁḍavā nīvu
valasinavām̐ḍavai te vāsulĕṁtuvā
nĕla kŏgamāḍu vachchi nidradĕṁki nuṁḍam̐gānu
tĕlisĕnā nāguṇamu teḍadĕllamiganu

(||||)
suṭṭariga mĕṟim̐gide sulabhāna navvavā
guṭṭugannavām̐ḍavaide kŏṁchivuṁduvā
yĕṭṭagela kiḍu mādo yelāḍā lāḍidene
paṭṭĕnā nīmanasuna paṁtabunāsevalu

(||||)
karuṇiṁchavalaside kappuramiḍĕ miyyĕvā
sarasānagu lonaide sammadiṁchavā
yiravai śhrīveṁkaḍeśha yiṭṭĕ nannu nelidivi
sarivachchĕnā tŏlliḍi saṁgādabu radulu