కాంతపై మిక్కిలి బత్తిగలిగిన చెలులాల
(॥పల్లవి॥)
కాంతపై మిక్కిలి బత్తిగలిగిన చెలులాల
పొంత నీపె వేడుకలు పొసఁగఁగజేయరే
(॥కాంత॥)
వనములో కోవిలల వట్టి రట్టు సేయనేల
పెనఁగి తుమ్మిదల కోపించఁగనేల
పనివడి చందురునిపై నేరమెంచనేల
వినయాన విభునికే విన్నపము సేయరే
(॥కాంత॥)
గూటిలోని చిలుకలఁ గొసరి జంకించనేల
నీటునఁ జల్లగాలిని నిందించనేల
పాటించి వసంతునితో పంతాలు దూయనేల
మాటలాడి విభుని నెమ్మదిని రప్పించరే
(॥కాంత॥)
పంచనున్న పావురాల బదరి తిట్టఁగనేల
పంచసాయకుని నొడఁబరచనేల
యెంచఁగ శ్రీవేంకటేశుఁ డిదె వచ్చి యింతిఁ గూడె
మంచివాయఁ బనులెల్లా మనవులు చెప్పరే
(||pallavi||)
kāṁtabai mikkili battigaligina sĕlulāla
pŏṁta nībĕ veḍugalu pŏsam̐gam̐gajeyare
(||kāṁta||)
vanamulo kovilala vaṭṭi raṭṭu seyanela
pĕnam̐gi tummidala kobiṁcham̐ganela
panivaḍi saṁdurunibai neramĕṁchanela
vinayāna vibhunige vinnabamu seyare
(||kāṁta||)
gūḍiloni silugalam̐ gŏsari jaṁkiṁchanela
nīḍunam̐ jallagālini niṁdiṁchanela
pāḍiṁchi vasaṁtunido paṁtālu dūyanela
māḍalāḍi vibhuni nĕmmadini rappiṁchare
(||kāṁta||)
paṁchanunna pāvurāla badari tiṭṭam̐ganela
paṁchasāyaguni nŏḍam̐barasanela
yĕṁcham̐ga śhrīveṁkaḍeśhum̐ ḍidĕ vachchi yiṁtim̐ gūḍĕ
maṁchivāyam̐ banulĕllā manavulu sĕppare