కాంత యేమిసేసునే ఘనుఁడు తానేకాక
(॥పల్లవి॥)
కాంత యేమిసేసునే ఘనుఁడు తానేకాక
చెంతలఁ దనకే మరిఁ జేత మొక్కవలదా
(॥కాంత॥)
చలపట్టి తానే యెచ్చరికలు సేయఁగాను
యెలమి నాపెకుఁ బంతా లేల మానీనే
నెలకొని తానింతేసి నేరుపులు నేరుపఁగా
బలిమిమెరసి యింత ప్రౌఢ గాఁదగదా
(॥కాంత॥)
పొరుగున నుండి తానే పోదులెల్లాఁ జేయఁగాను
అరసిమేరలుమీర కాపె తక్కునా
పెరరేఁచి తాను నట్టే వేఁడుకొని వుండఁగాను
విరసముగాక వెల్లవిరులు గావలదా
(॥కాంత॥)
వద్ద నుండి తా నేఁడు వంకలెల్ల నొత్తఁగాను
అద్దుకొని ఆపె మాటలాడఁదగదా
ఇద్దరి శ్రీవేంకటేశుఁ డిటు మమ్ముఁ గూడఁగాను
వొద్దికై సవతులెల్లా నొక్కటి గావలదా
(||pallavi||)
kāṁta yemisesune ghanum̐ḍu tānegāga
sĕṁtalam̐ danage marim̐ jeda mŏkkavaladā
(||kāṁta||)
salabaṭṭi tāne yĕchcharigalu seyam̐gānu
yĕlami nābĕgum̐ baṁtā lela mānīne
nĕlagŏni tāniṁtesi nerubulu nerubam̐gā
balimimĕrasi yiṁta prauḍha gām̐dagadā
(||kāṁta||)
pŏruguna nuṁḍi tāne podulĕllām̐ jeyam̐gānu
arasimeralumīra kābĕ takkunā
pĕrarem̐si tānu naṭṭe vem̐ḍugŏni vuṁḍam̐gānu
virasamugāga vĕllavirulu gāvaladā
(||kāṁta||)
vadda nuṁḍi tā nem̐ḍu vaṁkalĕlla nŏttam̐gānu
addugŏni ābĕ māḍalāḍam̐dagadā
iddari śhrīveṁkaḍeśhum̐ ḍiḍu mammum̐ gūḍam̐gānu
vŏddigai savadulĕllā nŏkkaḍi gāvaladā