కాంత సిగ్గరికత్తె గయ్యాళించ నేరదు
(॥పల్లవి॥)
కాంత సిగ్గరికత్తె గయ్యాళించ నేరదు
సంతోసముతోడ నిట్టె చనవియ్యవయ్యా
(॥కాంత॥)
చెలి యానఁ వెట్టఁగాను చేతులెత్తి మొక్కఁగాను
బలిమితో చన్ను లేల పట్టేవయ్యా
పలుమారు వేడుఁకోఁగా పంతము లియ్యఁగాను
కెలనఁ గూచుండి యెంత గిలిగించేవయ్యా
(॥కాంత॥)
పెనఁగులాడఁగాను ప్రియములు చెప్పఁగాను
కొనగోరఁ జెక్కులేల చెనకేవయ్యా
మునుకొని వొడ్డుకోఁగా మోవి లంచమయ్యఁగాను
యెనగొని నిమ్మపంటనేల వేసేవయ్యా
(॥కాంత॥)
సారె సారె సొలయఁగా సంగడిఁ గూచుండఁగాను
చేరి వుద్దండాలేల సేసేవయ్యా
యీరీతి శ్రీవేంకటేశ యీకె నిన్నుఁ బెండ్లాడఁగా
కోరికె లీడేరె నేమి కొలఁది వెట్టేవయ్యా
(||pallavi||)
kāṁta siggarigattĕ gayyāḽiṁcha neradu
saṁtosamudoḍa niṭṭĕ sanaviyyavayyā
(||kāṁta||)
sĕli yānam̐ vĕṭṭam̐gānu sedulĕtti mŏkkam̐gānu
balimido sannu lela paṭṭevayyā
palumāru veḍum̐kom̐gā paṁtamu liyyam̐gānu
kĕlanam̐ gūsuṁḍi yĕṁta giligiṁchevayyā
(||kāṁta||)
pĕnam̐gulāḍam̐gānu priyamulu sĕppam̐gānu
kŏnagoram̐ jĕkkulela sĕnagevayyā
munugŏni vŏḍḍugom̐gā movi laṁchamayyam̐gānu
yĕnagŏni nimmabaṁṭanela vesevayyā
(||kāṁta||)
sārĕ sārĕ sŏlayam̐gā saṁgaḍim̐ gūsuṁḍam̐gānu
seri vuddaṁḍālela sesevayyā
yīrīdi śhrīveṁkaḍeśha yīgĕ ninnum̐ bĕṁḍlāḍam̐gā
korigĕ līḍerĕ nemi kŏlam̐di vĕṭṭevayyā