Kaamta neebai premagaani garvamugaadu

కాంత నీపై ప్రేమగాని గర్వముగాదు
Language

(॥పల్లవి॥)
కాంత నీపై ప్రేమగాని గర్వముగాదు
మంతనాన నెచ్చరించి మన్నించు మీకెను

(॥॥)
సందడిలోఁ గాఁగాను సాగిలి మొక్కమరచె
పందెమాడుతాఁ గానుకపట్ట మరచె
విందువెట్టి వేడుకను విడెమియ్యఁ గ మరచె
నిందుముఖితమకము లింత సేసె నిపుడు

(॥॥)
సేసపట్టి నిబ్బరాన సిగ్గులువడ మఱచె
ఆసల నవ్వుతా వినయము మఱచె
పాసికూడే సంతోసాన పాదములొత్త మఱచె
యీసతివుల్లాసము లింతసేసె నిపుడు

(॥॥)
నీ మొగము చూచి చూచి నేరుపులెల్లా మఱచె
చేముంచి కాగిటి నిఁచి చింత మఱచె
వేమరు నలమేల్మంగ విభుఁడ శ్రీవేంకటేశ
యీమగువ వేగిరము లింతసేసె నిపుడు

(||pallavi||)
kāṁta nībai premagāni garvamugādu
maṁtanāna nĕchchariṁchi manniṁchu mīgĕnu

(||||)
saṁdaḍilom̐ gām̐gānu sāgili mŏkkamarasĕ
paṁdĕmāḍudām̐ gānugabaṭṭa marasĕ
viṁduvĕṭṭi veḍuganu viḍĕmiyyam̐ ga marasĕ
niṁdumukhidamagamu liṁta sesĕ nibuḍu

(||||)
sesabaṭṭi nibbarāna sigguluvaḍa maṟasĕ
āsala navvudā vinayamu maṟasĕ
pāsigūḍe saṁtosāna pādamulŏtta maṟasĕ
yīsadivullāsamu liṁtasesĕ nibuḍu

(||||)
nī mŏgamu sūsi sūsi nerubulĕllā maṟasĕ
semuṁchi kāgiḍi nim̐si siṁta maṟasĕ
vemaru nalamelmaṁga vibhum̐ḍa śhrīveṁkaḍeśha
yīmaguva vegiramu liṁtasesĕ nibuḍu