Kaamkala yeppadanumdi kaasugunnado

కాఁకల యెప్పటనుండి కాచుకున్నదో
Language

(॥పల్లవి॥)
కాఁకల యెప్పటనుండి కాచుకున్నదో
మూఁకమొక్కులెల్లాను మొక్కీ నిదె నీకును

(॥కాఁక॥)
తమకించి రావంటాఁ దగ నీతో నలిగితే
క్రమ మెఱఁగి తానేల కదిసీ నాపె
అమరఁగ నఁ(నం?) తలో నిన్నట్టె కాఁగిలించుకొంటే
చెమటచేతులఁ దాను సేవసేసీ నీకును

(॥కాఁక॥)
దిక్కుల నీచేఁతలకు తిట్లు నేఁ దిట్టితేను
యెక్కువఁ దాఁజెవిలోన నిచ్చలాడీని
అక్కర నందుకుఁగాను అట్టె నేఁ బొదిగితే
మక్కువతో సారె నాకుమడిచిచ్చీ నీకును

(॥కాఁక॥)
నీవిచ్చినచనవున నీమోవి యానితేను
కావరానముట్టి వూడిగాలు సేసీని
యీవేళ శ్రీవేంకటేశ యిట్టె ముసుఁ గిడుకొంటే
ఆవలఁదా మఱఁదల ననుకొనీ నీకును

(||pallavi||)
kām̐kala yĕppaḍanuṁḍi kāsugunnado
mūm̐kamŏkkulĕllānu mŏkkī nidĕ nīgunu

(||kām̐ka||)
tamagiṁchi rāvaṁṭām̐ daga nīdo naligide
krama mĕṟam̐gi tānela kadisī nābĕ
amaram̐ga nam̐(naṁ?) talo ninnaṭṭĕ kām̐giliṁchugŏṁṭe
sĕmaḍasedulam̐ dānu sevasesī nīgunu

(||kām̐ka||)
dikkula nīsem̐talagu tiṭlu nem̐ diṭṭidenu
yĕkkuvam̐ dām̐jĕvilona nichchalāḍīni
akkara naṁdugum̐gānu aṭṭĕ nem̐ bŏdigide
makkuvado sārĕ nāgumaḍisichchī nīgunu

(||kām̐ka||)
nīvichchinasanavuna nīmovi yānidenu
kāvarānamuṭṭi vūḍigālu sesīni
yīveḽa śhrīveṁkaḍeśha yiṭṭĕ musum̐ giḍugŏṁṭe
āvalam̐dā maṟam̐dala nanugŏnī nīgunu