కామినులాల మీ కన్నులఁ బట్టఁడా బాలుఁ
(॥పల్లవి॥)
కామినులాల మీ కన్నులఁ బట్టఁడా బాలుఁ-
డేమమ్మా నవ్వేరు వీఁ డేమాయనమ్మా
(॥కామి॥)
చూడఁగలవాఁడు చేతఁ జూపఁగలవాఁడు వీఁడు
యేడ నెవ్వరైనాఁ గంటే నెత్తుకోఁదగువాఁడు
జాడతో రూపురేకా సాదించరానివాఁడు
యీడనే మాపసిబాలుఁ డేమాయనమ్మా
(॥కామి॥)
అడుగఁదగినవాఁడు అన్నిటానుదారివాఁడు
వుడిబడి వారి నేల నోల్లనివాఁడు
వడిఁ దానే ఇందరిని వలపించనేర్చువాఁడు
యెడసీ ముద్దాడమనే రేమాయనమ్మా
(॥కామి॥)
రచనమాటలవాఁడు రచ్చరాళ్ల మీఁదివాఁడు
ఇచట శ్రీవేంకటాద్రిపై నిరవైనాఁడు
పచరించ నేపనులాఁ బదిఁ బదైనవాఁడు
యెచట నాడి వచ్చినా నేమాయనమ్మా
(||pallavi||)
kāminulāla mī kannulam̐ baṭṭam̐ḍā bālum̐-
ḍemammā navveru vīm̐ ḍemāyanammā
(||kāmi||)
sūḍam̐galavām̐ḍu sedam̐ jūbam̐galavām̐ḍu vīm̐ḍu
yeḍa nĕvvarainām̐ gaṁṭe nĕttugom̐daguvām̐ḍu
jāḍado rūburegā sādiṁcharānivām̐ḍu
yīḍane mābasibālum̐ ḍemāyanammā
(||kāmi||)
aḍugam̐daginavām̐ḍu anniḍānudārivām̐ḍu
vuḍibaḍi vāri nela nollanivām̐ḍu
vaḍim̐ dāne iṁdarini valabiṁchanersuvām̐ḍu
yĕḍasī muddāḍamane remāyanammā
(||kāmi||)
rasanamāḍalavām̐ḍu rachcharāḽla mīm̐divām̐ḍu
isaḍa śhrīveṁkaḍādribai niravainām̐ḍu
pasariṁcha nebanulām̐ badim̐ badainavām̐ḍu
yĕsaḍa nāḍi vachchinā nemāyanammā